హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. కులదీప్ సేతి, సునీతారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 360 డిగ్రీ ఫిట్నెస్ కేంద్రంలో 30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్‌ను విజయ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
విజయ్ ఛాలెంజ్... 30 రోజుల్లో బరువు తగ్గడం ఎలా? - tollywood handsome vijay devarakonda
కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి అంటున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్‌ను ప్రారంభించారు.
విజయ్ దేవరకొండ ఫిట్నెస్ ఛాలెంజ్
లాక్డౌన్ సమయంలో 360 డిగ్రీ జిమ్‌కు వచ్చి వ్యాయామం చేయడం వల్ల చక్కటి శరీరాకృతి పొందడమే గాక ఆరోగ్యంగా ఉన్నానని విజయ్ పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. శరీరం దృఢంగా ఉండాలన్నా.. వ్యాధినిరోధక శక్తి పెరగాలన్నా వ్యాయామం తప్పనిసరి అని చెప్పారు.
- ఇదీ చూడండి :బాలీవుడ్ భామల ఫిట్నెస్ చిట్కాలు ఇవే!