సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పలు వరాలు, రాయితీలు ఇవ్వడం పట్ల నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి ఉపయోగపడే అనేక నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. 'మా' అసోసియేషన్ తరఫున జీవిత రాజశేఖర్ కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు నిర్మాతల మండలి కృతజ్ఞతలు - theatres in telangana
థియేటర్ల తెరచుకోవచ్చనే ఉత్వర్తులపై టాలీవుడ్ నిర్మాతల మండలి సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనకు వీరితో పాటు 'మా' అసోసియేషన్ కూడా కృతజ్ఞతలు తెలిపింది.
"చిన్న సినిమాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. త్వరలోనే సినీ పరిశ్రమ తరఫు నుంచి సీఎం కేసీఆర్ను ఘనంగా సన్మానిస్తాం. చిన్న నిర్మాతల తరఫున ఆయనకు కృతజ్ఞతలు. అలానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానిస్తాం" అని సి.కల్యాణ్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో త్వరలోనే అవి తెరుచుకునే అవకాశముంది. అంతకుముందు, కరోనా కష్టకాలంలో చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై పలువురు టాలీవుడ్ నటీనటులు, దర్శకులు ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు చేశారు.