తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత - tollywood director died

సీనియర్ దర్శకుడు ఆంజనేయులు అనారోగ్య సమస్యలతో మరణించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

tollywood director OSR ANJANEYULU passed away
టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

By

Published : Dec 25, 2020, 4:40 PM IST

సీనియర్ దర్శకుడు, నటుడు ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు(79) శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.

నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఆంజనేయులు.. దర్శకత్వ శాఖలో కృష్ణ, విజయనిర్మల, వి.రామచంద్రరావు, కె.హేమాంబదరరావు, కె.ఎస్,ఆర్.దాస్ తదితరుల దగ్గర పలు చిత్రాలకు పనిచేశారు. అనంతరం "కన్నెవయసు", మెగాస్టార్ చిరంజీవి "లవ్ ఇన్ సింగపూర్'' చిత్రాలకు దర్శకత్వం వహించారు.

పలువురు ప్రముఖ హీరోల చిత్రాలలో కూడా నటుడిగా కనిపించిన ఆంజనేయులు.. తన అభిరుచిని చాటుకున్నారు. దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ దర్శకుడు ఆంజనేయులు
సీనియర్ దర్శకుడు ఆంజనేయులు

ABOUT THE AUTHOR

...view details