తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అనుష్క శర్మపై జర్నలిస్టు కామెంట్​.. దర్శకుడు మారుతి ఫైర్​ - దర్శకుడు మారుతి

బాలీవుడ్​ నటి అనుష్కశర్మ.. తాను గర్భిణిగా ఉన్న ఫొటోను ఇటీవలే సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఈ పోస్ట్​పై వ్యంగ్యంగా కామెంట్​ చేసిన మహిళా జర్నలిస్టుపై.. టాలీవుడ్​ దర్శకుడు మారుతి మండిపడ్డారు. ఓ రాజ్యానికి రాణి అయినా ఓ బిడ్డకు తల్లిగా ఉండడంలోనే మహిళకు ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు.

Tollywood director maruthi supports anushka sharma and given strong counter to lady journalist who commented in social media
అనుష్క శర్మపై జర్నలిస్టు కామెంట్​.. దర్శకుడు మారుతి ఫైర్​

By

Published : Sep 15, 2020, 9:50 AM IST

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రస్తుతం తల్లికాబోతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఇటీవలే తెలిపారు. తన సంతోషాన్ని అందరికీ తెలియచేస్తూ ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ చూసి అభిమానులూ ముచ్చటపడ్డారు. అయితే ఓ మహిళా జర్నలిస్టు మాత్రం కొంచెం వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు.

"అనుష్క, ఆయన మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశారు. ఇంగ్లాండ్‌కు మహారాణిని చేయలేదు. మరీ అంత సంబరపడకండి" అంటూ జర్నలిస్టు చేసిన చేసిన కామెంట్‌పై.. దర్శకుడు మారుతి ఫైర్‌ అయ్యారు. ఒక రాజ్యానికి రాణిగా ఉండటం కంటే ఓ బిడ్డకు తల్లిగా ఉండడంలోనే మహిళకు ఎంతో సంతోషం ఉంటుందని ఆయన అన్నారు.

"ఒక మహిళా జర్నలిస్ట్‌ అయిన మీరు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం విచారంగా ఉంది. ఇంగ్లాండ్‌కు రాణిగా ఉండటం కంటే మాతృత్వపు ప్రేమను ఆస్వాదించడం ఓ మహిళకు ఎంతో సంతోషాన్నిస్తుంది. నిజం చెప్పాలంటే.. ప్రతి మహిళా ఓ మహారాణినే. ప్రతి సంతోషకరమైన నివాసం ఓ రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ కావడానికంటే ముందు ఓ సాధారణమైన స్త్రీ. తల్లికాబోతున్న క్షణాలను ఆసాంతం ఆనందించే హక్కు ఆమెకు ఉంది" అని మారుతి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details