తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడేది అప్పుడే: మారుతి - లాక్​డౌన్​పై దర్శకుడు మారుతీ

లాక్​డౌన్​ సమయాన్ని సృజనాత్మకంగా వినియోగించుకున్నానని చెప్పారు దర్శకుడు మారుతీ. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఈటీవీ భారత్​తో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

maruthi
మారుతీ

By

Published : Oct 8, 2020, 6:21 AM IST

'ఈరోజుల్లో', 'భలేభలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండుగే' చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మారుతి. తొలిరోజుల్లో విమర్శలు మూటగట్టుకున్నా.. వాటినే ప్రశంసలుగా తీసుకుని కొత్త తరహా కథలను అల్లుకున్నారు. కరోనా కాలంలో మహానుభావుడిగా సామాజిక బాధ్యతను గుర్తుచేశారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

మారుతీ

లాక్​డౌన్ సమయం ఎలా గడిచింది ?

కరోనా వల్ల దొరికిన సమయాన్ని నా వరకు నేను చాలా సృజనాత్మకంగా వినియోగించుకున్నాను. కొన్ని కొత్త కథలు రాసుకున్నాను. చర్చలు కూడా జరిగాయి. ఇంతకుముందులా ఒక కథ తర్వాత మరో కథను సిద్ధం చేసే పద్దతి నుంచి బయటపడ్డాను. ఇప్పుడు నా చేతిలో మూడు నాలుగు కథలున్నాయి. అన్ని సెట్స్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మారుతీ

సినీ పరిశ్రమపై కొవిడ్ ప్రభావం ఎలా ఉంది ?

నిర్మాణ పరంగా కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అయితే ప్రేక్షకులు సినిమా చూడటం మాత్రం ఆపలేదు. కొత్త కొత్త జోనర్స్ చిత్రాలు చూడటం మొదలుపెట్టారు. అయితే సినిమా నిర్మాణంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి. అవి కూడా ఇప్పుడు అధిగమించి ప్రస్తుతం పరిశ్రమ అంతా సాధారణ స్థితికి వచ్చిందని భావిస్తున్నా.

50 శాతం ప్రేక్షకులతో థియేటర్లు తెరుస్తామంటున్నారు. ప్రేక్షకులు వస్తారంటారా ?

థియేటర్లో ప్రేక్షకులు అస్సలు లేకపోవడం కంటే 50 శాతం ఉండటం మంచిదే కదా. ముందు ఒక్కరు వచ్చినా బొమ్మ వేసేవారు. ఇప్పుడు 50 శాతంతో నడిపించాలనడం మంచి పరిణామమే. అయితే ఈ రెండు నెలలు ప్రేక్షకుల సంఖ్య తగ్గినా జనవరిలో మాత్రం 100 శాతం ఆడియెన్స్​తో థియేటర్లు కళకళలాడతాయి. అలాగే ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేటర్​లో సినిమా చూసిన అనుభవం వేరేలాగా ఉంటుంది. అయితే ఓటీటీ వల్ల కూడా ఉపయోగాలున్నాయి. కొత్త టాలెంట్ కనిపిస్తుంటుంది. కొత్త కథలు, కొత్త రకమైన వినోదం ప్రేక్షకులకు దొరుకుతుంది.

మారుతీ

మీ తదుపరి సినిమాలేంటీ ?

నా మాతృసంస్థలు యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలయికలో ఓ సినిమా చేస్తున్నా. 2021 ఫిబ్రవరి నుంచి షూటింగ్ ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైన్​లో ఉన్నాయి. త్వరలోనే ఆ వివరాలు కూడా చెబుతాను. అలాగే ఓ వెబ్ సిరీస్​కు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నా.

మారుతీ

ఇదీ చూడండి:- దివ్యాంగుల కోసం మెగా దంపతుల డాన్స్​షో

ABOUT THE AUTHOR

...view details