శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భళా తందనాన'. రజినీ కొర్రపాటి నిర్మాత. కేథరీన్ కథానాయిక. రామచంద్రరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. కరోనా పరిస్థితులతో చిత్రీకరణ దశలో ఆగిన ఈ సినిమా.. సోమవారం హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది. "ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌తో చైతన్య ఈ సినిమాని రూపొందిస్తున్నారు. శ్రీవిష్ణు ఓ వైవిధ్యమైన పాత్రని ఇందులో పోషిస్తున్నారు" అని చిత్ర నిర్మాత తెలియజేశారు.
మళ్లీ సెట్లోకి శ్రీవిష్ణు.. 'దెయ్యాలున్నాయా' ప్రారంభం - భళా తందనాన మూవీ
సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. కరోనా పరిస్థితులతో చిత్రీకరణ దశలో ఆగిన 'భళా తందనాన' సినిమా.. సోమవారం హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది. శ్రీనివాస్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'దెయ్యాలున్నాయా?' చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
జై హింద్ గౌడ ప్రధాన పాత్రలో కంకణాల శ్రీనివాస్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దెయ్యాలున్నాయా?'. ప్రియాంక కథానాయిక. గౌతమ్ రాజు, హేమ సుందర్, రఘునాథ్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏలూరు సురేందర్ రెడ్డి క్లాప్ ఇవ్వగా.. కొప్పుల నరసింహ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. భీమ్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర దర్శక నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ "ప్రేతాత్మల కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. వినోదంతో పాటు హారర్, థ్రిల్లింగ్ అంశాలు నిండి ఉంటాయి. నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు అమ్మాయిలు చుట్టూ తిరుగుతుంది" అని తెలిపారు.
ఇదీ చదవండి:Navarasa Review: 'నవరస' వెబ్‌సిరీస్ ఆకట్టుకుందా?