"దిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే" అంటారు. సినిమాల్లో రాణిస్తూ స్టార్లుగా మనకు కనిపించినా, వాళ్లమ్మకు మాత్రం చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు మన తారలు. ఎంతైనా వాళ్లూ తల్లిచాటు బిడ్డలే కదా! ఆదివారం (మే 9) మాతృదినోత్సవం సందర్భంగా తమ మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్లతో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు పలువురు సినీ తారలు. ఆ విశేషాలివీ..
*తనకు మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేసింది అని వాళ్ల అమ్మను గుర్తు చేసుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.