డాటర్స్ డే సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవి, రవితేజ, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ తదితరులు తమ కుమార్తెలతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. కూతుళ్లతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
సోషల్ వాచ్: 'కుమార్తెలు మన జీవితానికి వెలుగులు' - రవితేజ డాటర్స్ డే
ఆదివారం అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీప్రముఖులు వారి కూతుళ్లతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. వారితో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
డాటర్స్ డే స్పెషల్: 'కుమార్తెలు మన జీవితానికి వెలుగులు'
"కూతుళ్లు మన జీవితానికి వెలుగులు.. వాళ్లు మన జీవితంలో నింపిన ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ప్రపంచంలోని కుమార్తెలందరికీ శుభాకాంక్షలు" అని చిరు పోస్ట్ చేశారు.
- "అన్షులా, జాన్వి, ఖుషి.. ఈ ముగ్గురు ఏంజెల్స్ నా జీవితంలో ఆనందం, సంపదను నింపారు. వీళ్లు నా కుమార్తెలు కావడం నా అదృష్టం" అని బోనీ కపూర్ ట్వీట్ చేశారు.
- నటి ప్రియమణి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వీడియో పంచుకున్నారు. ఆయన్ను ఎంతో ప్రేమిస్తున్నట్లు పేర్కొన్నారు.
- నటి వితికా షేర్ యాంకర్‌గా మారారు. వ్యాఖ్యాతగా తన తొలి షో ఆదివారం సాయంత్రం ఈటీవీలో ప్రసారం కాబోతోందని చెప్పారు.
- నటి, నిర్మాత ఛార్మి తన పెంపుడు కుక్కలతో కాలక్షేపం చేస్తున్నారు.