కరోనా మహమ్మారి దేశంలో ప్రతాపం చూపిస్తోంది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీస్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒకర్నీ ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు గతేడాది వైరస్ బారినపడ్డారు. తాజాగా సెకండ్ వేవ్‌లోనూ కొందరు హీరోహీరోయిన్లకు కరోనా సోకింది. వారెవరో చూద్దాం.
పవన్ కల్యాణ్
ఈ మధ్య టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు కరోనా రావడం. వకీల్‌సాబ్ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనడం, ఇటు రాజకీయాల పరంగానూ వివిధ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఆయనకు వైరస్ సోకింది. వెంటనే తన ఫామ్ హౌజ్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు పవన్.
అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కూడా ఇటీవలే కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నివేదా థామస్
వకీల్ సాబ్ చిత్రంతో ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన నివేదా థామస్.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముందు కరోనా బారినపడింది. దీంతో ఈ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. చాలా రోజులు క్వారంటైల్లో ఉన్న నివేదా తాజాగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించింది.
అనిల్ రావిపూడి
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా బారిన పడిన అనిల్ రావిపూడికి ఇటీవల మరోసారి వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సోనూసూద్