విహారయాత్రలో సెలబ్రిటీలు.. ఛలో మాల్దీవులు
లాక్డౌన్ ప్రభావం తర్వాత ఇప్పుడిప్పుడే అందరూ విహారయాత్రలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు ఛలో మాల్దీవులు అంటూ ఆ దేశంలో వాలిపోయారు. ఇంతకీ వారెవరంటే?
మాల్దీవులు.. పర్యాటకులకు భూతల స్వర్గధామంగా పేరుపొందిన ప్రదేశం. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు.. ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదేమో..! అందుకే.. ఎప్పుడూ బిజీగా ఉండే సినీతారలు కొంచెం విశ్రాంతి దొరికినా సరే మాల్దీవుల్లో వాలిపోతుంటారు. అయితే, లాక్డౌన్ కారణంగా.. వేసవి టూర్స్‌కు దూరంగా కొన్ని నెలలపాటు ఇంట్లోనే గడిపిన తారలందరూ.. ఇటీవల తమకిష్టమైన ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో మాల్దీవులు వెళ్లిన, వెళ్లి వచ్చిన సెలబ్రిటీలు ఫొటోలు మీకోసం.