ప్రముఖ నటుడు, రచయిత, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు మృతిపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. గొల్లపూడి లేని లోటు తీర్చలేనిదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
"గొల్లపూడి మారుతీరావు ఆకస్మిక మరణం నన్ను కలచివేసింది. టాలీవుడ్‌కు ఆయన చేసిన సేవలు మరులేనివి. మేం ఓ ఆణిముత్యాన్ని కోల్పోయాం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" -మహేశ్‌బాబు, హీరో
గొల్లపూడి మృతిపై సూపర్‌స్టార్ మహేశ్, అల్లరి నరేశ్ ట్వీట్స్ "గొల్లపూడి మారుతీరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. రచనలోనైనా, నటనలోనైనా నా అభిమాన నటుల్లో ఆయనొకరు. మీరు లేని లోటు టాలీవుడ్లో స్పష్టంగా కనబడుతుంది" -అల్లరి నరేశ్, హీరో
"మారుతీరావుతో పనిచేయడం నాకు దక్కిన వరం. అద్భుతమైన వ్యక్తి. ఆయన సినిమాకు చేసిన సేవలు మరువలేనివి. రెస్ట్ ఇన్ పీస్ గురువుగారు" -వరుణ్‌తేజ్, హీరో
"ఆయన రచన.... ఆయన నటన.... ఎప్పటికీ మరువలేము..... గొల్లపూడి మారుతీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" -అనిల్ రావిపూడి, దర్శకుడు
గొల్లపూడి మారుతీరావు మృతిపై దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్
"ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, మాటల రచయితగా, నటుడిగా.. ఇలా అన్ని విభాగాల్లో మేటి అనిపించుకొని, నంది అవార్డ్స్ దక్కించుకున్న గొప్ప ఆదర్శ మూర్తి "గొల్లపూడి మారుతీ రావు" ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను" -కోన వెంకట్, రచయిత-నిర్మాత
గొల్లపూడి మృతిపై సంతాపం తెలుపుతున్న నటుడు అలీ
గొల్లపూడి మృతిపై సంతాపం తెలుపుతున్న వ్యాఖ్యాత ఉదయభాను
గొల్లపూడి మారుతీరావు మృతిపై హీరో మంచు మనోజ్ ట్వీట్
గొల్లపూడి మారుతీరావు మృతిపై దర్శకుడు మెహర్ రమేశ్ ట్వీట్
గొల్లపూడి మారుతీరావు మృతిపై హీరో గోపీచంద్
గొల్లపూడి మారుతీరావు మృతిపై హీరయిన్ ఈషా రెబ్బా ట్వీట్