తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Father's Day: నాన్న గురించి ఎవరేమన్నారంటే...

'నాన్నా.. నువ్వే మా స్ఫూర్తి' అంటూ పలువురు టాలీవుడ్​ సెలబ్రిటీలు తమ తండ్రులకు ఫాదర్స్​ డే శుభాకాంక్షలు తెలిపారు. తమను చేయి పట్టుకుని నడిపించిన నాన్నల గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు.

celebreties fathers day
సెలబ్రిటీల ఫాదర్స్​ డే విషెస్​

By

Published : Jun 20, 2021, 2:43 PM IST

Updated : Jun 20, 2021, 3:37 PM IST

ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని పలువురు టాలీవుడ్‌ స్టార్‌ హీరోహీరోయిన్లు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. 'నాన్నా.. నువ్వు మా స్ఫూర్తి' అని పేర్కొంటూ మధురజ్ఞాపకాలను పంచుకున్నారు.

"మా నాన్నకి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతలు నెరవేర్చటం కోసం ప్రతిరోజూ కష్టపడే నాన్నలందరికీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు"

-చిరంజీవి

మహేశ్​ బాబు, కృష్ణ

"నా హీరో, ఎల్లప్పుడూ నన్ను గైడ్‌ చేసే చిరుదీపం, స్ఫూర్తి.. ఇవి మాత్రమే కాదు వీటన్నింటినీ మించిన వ్యక్తి మీరు. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్న"

-మహేశ్‌బాబు

నమ్రత

"మా సామ్రాజ్యానికి రాజైన మహేశ్‌కు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు. మనకెంతో ఇష్టమైన వారు ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్లరు. మన కంటికి కనిపించకపోయినప్పటికీ వాళ్లు మనతోనే ఉంటారు. మన వెనుకే వస్తారు. డాడీ.. ప్రతి రోజూ నిన్ను గుర్తు చేసుకోవడం బాగుంది. కానీ నిన్ను మిస్‌ కావడం బాధగా ఉంది. ఐ లవ్‌ యూ డాడీ"

-నమ్రత

మోహన్​ బాబు, మంచు లక్ష్మీ

"నా జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మీతోనే ఉన్నాయి. మన కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నువ్వు బెస్ట్‌ ఫ్రెండ్‌ .. అలాగే అందరిలో నువ్వు ప్రేరణ నింపావు. మీ ప్రేమ, ప్రోత్సాహం లేకపోతే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. థ్యాంక్యూ డాడీ. వి లవ్‌ యూ"

-మంచు లక్ష్మి

అల్లు అర్జున్​, అల్లు అరవింద్​

"ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికీ హ్యాపీ ఫాదర్స్‌ డే"

-అల్లుఅర్జున్‌

నాగబాబు, వరుణ్​ తేజ్​

"మన తండ్రీకొడుకుల అనుబంధం ఎన్నో సంవత్సరాల క్రితమే స్నేహబంధంగా మారినందుకు ఎంతో ఆనందిస్తున్నాను"

-వరుణ్‌ తేజ్‌

చిరంజీవి, శ్రీజ

"నాన్నా.. మీ గొప్పతనం గురించి చెప్పడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఎల్లప్పుడు నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు" -శ్రీజ

ఇదీ చూడండి:Sridevi drama company:తండ్రీ కొడుకుల ఫన్ హంగామా

ఇదీ చూడండి:Bollywood: సంపాదన కోట్లలో.. ఉండేది అద్దె ఇంట్లో!

Last Updated : Jun 20, 2021, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details