'అలా ఇన్స్టాపురములో' తళుక్కుమన్న తారలు - manchu lakshmi latest news
కరోనా కాలంలో విధించిన లాక్డౌన్ కారణంగా సినీలోకం ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొంతమంది భామలు శుక్రవారం ఇన్స్టాలో అభిమానులను పలకరించారు. ఒకరు తల్లిదండ్రుల ఫొటోలు షేర్ చేస్తే, మరొకరు కలర్ఫుల్ లిప్‌స్టిక్ వేసుకొని కనిపించారు. ఇంకొందరు వంటింటి ఘుమఘుమలు రుచి చూపించారు. ఇంకా ఎవరెవరు ఏం చేశారో చూసేద్దాం రండి.
'అలా ఇన్స్టాపురములో' తలుక్కుమన్న గ్లామర్
లాక్డౌన్ వేళ సినీతారలు ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. నమ్రతా శిరోద్కర్ తన తల్లిదండ్రుల చిత్రాన్ని షేర్ చేస్తే.. నటి సమంత ఎరుపు రంగు లిప్‌స్టిక్ వేసుకున్న ఫొటోను షేర్ చేసింది. ఇక టాలీవుడ్ బ్యూటీ అనుష్క తన ఫేస్‌బుక్ ఫాలోవర్ల సంఖ్య రెండు కోట్లకు చేరిన సందర్భంగా అభిమానులపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉంటే యాంకర్ సుమ సున్నుండలు చేస్తూ ప్రత్యక్షమైంది. ఇంకా ఎవరెవరు ఏం షేర్ చేశారో మీరే చూసేయండి.