తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Tollywood: షూటింగ్స్​ షురూ.. బడా చిత్రాలు​ ఎప్పుడంటే? - tollywood news

సినిమా సెట్‌ కళకళలాడితేనే చిత్రసీమకి ఉత్సాహం. థియేటర్లలో కొత్త సినిమా విడుదలైనప్పుడే అసలు సిసలు సందడి. కరోనా పుణ్యమా అని కొన్ని నెలలుగా అటు థియేటర్లు లేవు.. ఇటు చిత్రీకరణలూ లేవు. వరుసగా రెండో ఏడాదీ వేసవిని కోల్పోయిన చిత్రసీమలో స్తబ్దత కనిపించింది. ఎట్టకేలకి రెండో దశ కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల చిత్రసీమలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. నిలిచిపోయిన చిత్రీకరణలు పునః ప్రారంభం అవుతున్నాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం..

Shootings to resume
షూటింగ్స్​ షురూ

By

Published : Jun 16, 2021, 6:47 AM IST

Updated : Jun 16, 2021, 8:15 AM IST

దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం వల్ల చిత్రబృందాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నాయి. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ తదితరులు తమ సినిమాల కోసం ఇప్పటికే రంగంలోకి దిగారు. తెలుగు అగ్ర తారలు కెమెరా ముందుకు వెళ్లడానికి మరికొంచెం సమయం పట్టేలా ఉంది. వచ్చే నెల ఆరంభంలో వాళ్ల సినిమాలపై స్పష్టత వస్తుంది. పరిమిత, మధ్యస్థ వ్యయంతో తెరకెక్కుతున్న పలు చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణల కోసం ప్రణాళికలు రచించాయి.

ఒకొక్కటిగా..
తొలి దశ కరోనా తర్వాత సినిమాలు పట్టాలెక్కడానికి చాలా సమయమే పట్టింది. రెండో దశ తర్వాత చిత్రబృందాలు ధైర్యంగా సెట్స్‌పైకి వెళుతున్నాయి. కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేయాలో ఇప్పటికే అవగాహన ఏర్పడింది. వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతోంది. నిర్మాణ సంస్థలే ముందుకొచ్చి నటులు, సాంకేతిక నిపుణులకు వ్యాక్సిన్‌ ఇప్పించాయి. అందుకే లాక్‌డౌన్‌ పూర్తిగా తొలిగించకముందే సినిమాలు పట్టాలెక్కాయి. సంపూర్ణేష్‌ బాబు 'క్యాలీఫ్లవర్‌' రామోజీ ఫిల్మ్‌సిటీలో వేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది.
నాగచైతన్య 'థ్యాంక్యూ'(Thanku) ఎనిమిది రోజులు చిత్రీకరణ చేస్తే పూర్తవుతాయి. 'మాస్ట్రో' సోమవారమే షూటింగ్‌ పునః ప్రారంభించింది. ఇక 'థ్యాంక్యూ' కోసం ఈనెల 21 నుంచి రంగంలోకి దిగుతున్నారు నాగచైతన్య. సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం'(sakunthalam) కోసం ఇప్పటికే ఓ భారీ సెట్‌ని తీర్చిదిద్దారు. ఈ నెల 24 నుంచి అందులో చిత్రీకరణ మొదలుపెడతారు. 'ఖిలాడి' కోసం రవితేజ ఈ నెలలోనే రంగంలోకి దిగుతారు.

జులై నుంచి వేగం
అగ్ర కథానాయకుల చిత్రాలు జులై తొలి వారం నుంచి పట్టాలెక్కనున్నాయి. ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌'(Radhe Shyam) 10 రోజులు చిత్రీకరణ చేస్తే పూర్తవుతుంది. వచ్చే నెల ఆరంభంలో ఆ సినిమా పునః ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అల్లు అర్జున్‌ నటిస్తున్న 'పుష్ప'(Pushpa) కొత్త షెడ్యూల్‌ వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానుందట. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'(RRR), 'ఆచార్య'(Acharya) చిత్రాలు తుదిదశకు చేరుకున్నాయి. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ నటిస్తున్న 'ఎఫ్‌3'(F3) కోసం కూడా రంగం సిద్ధమైనట్టు సమాచారం. జులైలో సినిమాలన్నీ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. చిత్రీకరణల్ని బట్టి విడుదల తేదీలపై ఆయా చిత్రబృందాలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. ఆగస్టు తర్వాతే అగ్ర తారల చిత్రాలు విడుదల తేదీల్ని ఖరారు చేయనున్నాయి.

ఇదీ చూడండి: Tollywood News: షూటింగ్​ సందడి ఎప్పుడో?

Last Updated : Jun 16, 2021, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details