తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ హీరోలతో 'బాహుబలి' ఢీ- దక్షిణాదిలో టాప్ - ప్రభాస్​ 14 మిలియన్ల ఫాలోవర్లు

బాహుబలి సినిమాతో పాన్ఇండియా ​స్టార్​గా మారిన ప్రభాస్​కు ఫ్యాన్​ ఫాలోయింగ్​ అమాంతం పెరిగింది. తాజాగా ఫేస్​బుక్​లో ఇతడి ఫాలోవర్లు 14 మిలియన్లు(కోటి 40 లక్షలు) దాటేశారు. దక్షిణాది​ హీరోల్లో ఇతడే టాప్​లో కొనసాగుతున్నాడు.

Tollywood Bahubali Prabhas
అభిమానుల అండలోనూ బాహుబలివే​...

By

Published : Jun 6, 2020, 1:18 PM IST

భారీ బడ్జెట్​, భారీ కలెక్షన్లతో సినిమాల్లో ట్రెండ్​ సెట్​ చేసిన ప్రభాస్​.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ దుమ్మురేపుతున్నాడు. తాజాగా డార్లింగ్​​ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో పాన్​ ఇండియా స్టార్​గా మారిన ఈ మిస్టర్​ ఫర్​ఫెక్ట్​.. అభిమానుల ఆదరణలోనూ ముందంజలో దూసుకెళ్తున్నాడు.ఫేస్​బుక్​లో తాజాగా 14 మిలియన్ల మార్కు దాటేశాడు. ఈ రికార్డులో దక్షిణాదిన టాప్​ హీరోగా ఘనత సాధించాడు. ఇతడికి దరిదాపుల్లో అల్లు అర్జున్​(కోటి 31 లక్షలు) మాత్రమే ఉన్నాడు. ప్రస్తుతం ఈ బాహుబలి.. బాలీవుడ్​ను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆమిర్​ఖాన్​(1 కోటి 70 లక్షల) ఫాలోవర్స్​తో ప్రభాస్​కు దగ్గరగా ఉన్నాడు.

ప్రభాస్​ ఫాలోవర్లు

మహేశ్​బాబు, తమిళ హీరో విజయ్​, రానా, కమల్​హాసన్​, జూనియర్​ ఎన్టీఆర్​, దుల్హర్​ సల్మాన్​, రామ్​చరణ్​, నాని, విజయ్​ దేవరకొండ, పవన్​కళ్యాణ్​, రజనీకాంత్​ వంటి స్టార్​లు రేసులో తర్వాత ఉన్నారు.

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం ఓ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ దర్శకుడు. ఇటీవలే జార్జియాలో ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే పేర్లను ఇప్పటికే రిజిస్టర్​ చేయించారు. కానీ వీటిలో ఏది ఇంకా ఖరారు చేయలేదు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: సమయం ఆసన్నమైంది మిత్రమా.. పెళ్లి రైలు ఎక్కేద్దాం!

ABOUT THE AUTHOR

...view details