నటి పాయల్ రాజ్‌పుత్ కెరీర్.. మూడు పాటలు, ఆరు సినిమాల్లా సాగిపోతోంది. వృత్తిపరంగా జోష్ మీదున్న ఈ అమ్మడు.. తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన ప్రియమైన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పంచుకుంటూ.. ఓ విషయాన్ని తెలియజేసింది.
సౌరభ్‌తో పొటోలు షేర్ చేసిన పాయల్ "నాలోని మంచీ చెడులను ప్రేమించే ఒకే ఒక వ్యకివి నువ్వు. నీకంటే ఎవ్వరూ నాకు ప్రియమైన వారు కాదు. నీతో గడిపిన సమయం నాకు ఓ మధుర జ్ఞాపకం. నా జీవితంలోకి ఎంతో ఆనందం తీసుకొచ్చావు. హ్యాపీ బర్త్‌డే మై జాన్."
-- పాయల్ రాజ్‌పుత్, నటి
పాయల్‌తో ఉన్న వ్యక్తి పేరు సౌరభ్‌గా తెలుస్తోంది. పలు పంజాబీ ధారావాహికల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఒకర్నొకరు ఇష్టపడినట్లు సమాచారం.
ఇటీవల వెంకటేశ్‌తో 'వెంకీమామ', రవితేజతో 'డిస్కోరాజా' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది పాయల్. ప్రస్తుతం ప్రణదీప్ అనే దర్శకుడితో ఓ నాయికా ప్రాధాన్య సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళంలో 'ఏంజెల్' అనే సినిమాతో తెరంగేట్రానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నట్లు ఇటీవలె పాయల్ వెల్లడించింది.