టాలీవుడ్‌లోని దినసరి వేతన కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి హాస్య నటుడు వెన్నెల కిశోర్.. రూ.2 లక్షలు ఇచ్చాడు.
కరోనా క్రైసిస్ ఛారిటీకి టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు - tollywood news
18:45 March 29
రూ.2 లక్షలు ఇచ్చిన హాస్యనటుడు వెన్నెల కిశోర్
15:37 March 29
రూ.లక్ష ఇచ్చిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్
కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల కోసం రూ.లక్ష రూపాయల అందజేయనున్నాడు టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు. త్వరలో దీని నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చాడు.
15:36 March 29
రూ.20 లక్షలు ఇచ్చిన రవితేజ
కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం మాస్మాహారాజా రవితేజ.. రూ.20 లక్షలు ఇచ్చాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
15:33 March 29
మెగాహీరో సాయిధరమ్ తేజ్ విరాళం రూ.10 లక్షలు
కరోనా క్రైసిస్ ఛారిటీ అద్భుతమైన ఆలోచన అని అన్నాడు హీరో సాయిధరమ్ తేజ్. దినసరి వేతన కార్మికుల కోసం తన వంతు సాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ ఆలోచనకు నాంది పలికిన మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు చెప్పాడు.
13:00 March 29
రూ.15 లక్షలు ఇచ్చిన హీరో శర్వానంద్
సినిమాల మేకింగ్ విషయంలో ఎంతో కష్టపడే దినసరి వేతన కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటికీ రూ.15 లక్షలు ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు హీరో శర్వానంద్. ఈ రోజే ట్విట్టర్లో ఖాతా ప్రారంభించాడీ కథానాయకుడు.
11:15 March 29
హీరో విశ్వక్షేన్ విరాళం రూ.5 లక్షలు
తన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ఖాతా తెరిచిన హీరో విశ్వక్సేన్.. కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ విషయాన్ని ట్వీట్ చేశాడు. ఇటీవలే 'హిట్'తో ప్రేక్షకులను అలరించిన ఇతడు.. ప్రస్తుతం 'పాగల్' అనే సినిమా చేస్తున్నాడు.
11:12 March 29
దిల్‌రాజు-శిరీష్ రూ.10 లక్షల విరాళం
టాలీవుడ్‌లోని వేతన కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళంగా రూ.10 లక్షలు ఇచ్చారు నిర్మాతలు దిల్‌రాజు-శిరీష్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
10:59 March 29
రూ.20 లక్షలు ఇచ్చిన వరుణ్‌తేజ్
కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ వేతన కార్మికుల కోసం హీరో వరుణ్‌తేజ్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఆ మొత్తాన్ని కరోనా క్రైసిస్ ఛారిటీకి ఇవ్వనున్నట్లు చెప్పాడు.