తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరుణ్​ త్రోబ్యాక్​ ఫొటో... మెగా హీరోలు చిన్నప్పుడిలా - mega heroes in childhood

టాలీవుడ్​ ప్రముఖ నటుడు వరుణ్​తేజ్​ తాజాగా చిన్ననాటి ఫొటోను ఒకటి షేర్​ చేశాడు. ఇందులో నలుగురు స్టార్​హీరోలు ఒకే ఫ్రేములో ఉండటం విశేషం.

వరుణ్​ త్రోబ్యాక్​ ఫొటో... మెగా హీరోలు చిన్నప్పుడు ఇలా

By

Published : Nov 22, 2019, 5:52 PM IST

ఇటీవల 'గద్దలకొండ గణేష్‌' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు టాలీవుడ్‌ యువ నటుడు వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన కఠోర సాధన చేస్తున్నాడు. ఇందుకోసం విదేశాలకు చెందిన ప్రముఖ బాక్సింగ్​ ట్రైనర్‌ వద్ద తర్ఫీదు పొందుతున్నాడు.

తాజాగా తన చిన్ననాటి ఫొటోను షేర్​ చేశాడు. ఇందులో వరుణ్​తేజ్​తో సహా అల్లుఅర్జున్​, రామ్​చరణ్​, సాయిధరమ్​తేజ్​ ఉన్నారు. వీరితో పాటు చిరంజీవి కూతురు సుస్మిత కూడా ఉంది.

వరుణ్​ షేర్​ చేసిన ఫొటో

తాజా చిత్రంలో వరుణ్‌ తేజ్‌ సరసన బాలీవుడ్​ భామ కియరా అడ్వాణీ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. మహేశ్​ బాబు సరసన 'భరత్ అనే నేను', రామ్​ చరణ్​కు జోడీగా 'వినయ విధేయ రామ' చిత్రాల్లో నటించింది కియరా. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. డిసెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందీ చిత్రం. ఈ సినిమాకు పేరు ఇంకా ఖరారు కాలేదు. వీటీ10 అనే వర్కింగ్ టైటిల్​తో ​ ప్రారంభమైంది.

బాక్సర్​గా వరుణ్​

ABOUT THE AUTHOR

...view details