తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాలక్షేపం కోసం కసరత్తులు చేస్తోన్న హీరో - v cinima news

కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా టాలీవుడ్‌ హీరో సుధీర్​ బాబు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. ప్రస్తుతం కాలక్షేపం కోసం ఇంట్లో ఉన్న వస్తువులతో వర్కౌట్లు ఎలా చేయాలో ఓ వీడియో చేశాడు. ఇది ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Tollywood actor Sudheer Babu Started 5 Day Home Workout Challenge
కాలక్షేపం కోసం కసరత్తులు చేస్తోన్న హీరో

By

Published : Mar 20, 2020, 7:19 AM IST

రోజురోజూకూ కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న కారణంగా ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే థియేటర్లు, పార్కులు, విద్యాసంస్థలు కొన్ని రోజులపాటు మూసి వేశారు. జిమ్‌లనూ క్లోజ్‌ చేశారు. ఫలితంగా నటుడు సుధీర్‌ బాబు ఇంట్లో ఉండే సామాగ్రితో వర్కౌట్లు ఎలా చేయవచ్చో తెలియజేస్తూ.. ప్రత్యేక వీడియోను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశాడు. వాటర్ బాటిల్‌, బాల్‌తో పాటు సోఫాలను ఉపయోగించి పుషప్స్‌ చేయడాన్ని వివరించాడు.

ఫిట్​నెస్​పై ఎక్కువగా దృష్టిపెట్టే సుధీర్​.. ప్రముఖ మ్యాగజైన్‌ 'హైదరాబాద్‌ టైమ్స్‌' ప్రతి ఏడాదిలాగానే 2019 సంవత్సారానికి గాను 'మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌' జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆన్‌లైన్ ఓటింగ్‌ ప్రక్రియలో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 8వ స్థానంలో నిలిచాడీ యువ హీరో.

సుధీర్‌-నాని కీలకపాత్రల్లో నటించిన చిత్రం 'వి'. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా విడుదల చేయాల్సింది. కానీ కరోనా వైరస్‌ కారణంగా ఈ సినిమాను కొంతకాలంపాటు వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details