యశ్ హీరోగా నటించిన కన్నడ సినిమా 'కేజీఎఫ్' దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్య సీనియర్ కథానాయిక రవీనా టాండన్ నటిస్తోందనీ ప్రకటించింది చిత్రబృందం. ఇప్పుడు ఈ జాబితాలో ఓ టాలీవుడ్ నటుడు చేరాడు.
'కేజీఎఫ్ 2'తో కన్నడ పరిశ్రమలోకి తెలుగు నటుడు - KGF hero yash
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'కేజీఎఫ్ 2'. ఈ సినిమాలో టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేశ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
'కేజీఎఫ్ 2'లో టాలీవుడ్ నటుడు రావురమేశ్
ప్రముఖ టాలీవుడ్ నటుడు రావు రమేశ్.. 'కేజీఎఫ్ 2'లో నటించనున్నట్టు దర్శకుడు ప్రశాంత్‌నీల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కన్నడ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ సీనియర్ నటుడు.. తొలిసారి కన్నడలో తెరంగేట్రం చేయనున్నాడు.
ఇదీ చూడండి.. 'కేజీఎఫ్ 2'లో రవీనా... ప్రకటించిన చిత్రబృందం
Last Updated : Feb 29, 2020, 9:11 PM IST