తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భోగి శుభాకాంక్షలు చెప్పిన 'అల్లూరి సీతారామరాజు'...! - రామ్‌చరణ్

టాలీవుడ్​ ప్రముఖ హీరో రామ్​ చరణ్​...  ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజు ఉదయం తీసుకున్న కొన్ని పొటోలను షేర్​ చేశాడు. ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్​' షూటింగ్​లో బిజీగా ఉన్న ఈ స్టార్​ హీరో... త్వరలో మెగాస్టార్​ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో కియారాతో జోడీగా కనిపించనున్నాడట.

Tollywood Actor Ramcharn wishes the fans and people on the Occasion of  Bhogi Festival 2020
భోగి శుభాకాంక్షలు చెప్పిన 'అల్లూరి సీతారామరాజు'...!

By

Published : Jan 14, 2020, 9:25 AM IST

అగ్రహీరో రామ్​చరణ్​ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు తెలిపాడు. ఎప్పటికప్పడు సామాజిక మాధ్యమాల్లో తన అప్​డేట్​లు​ పెట్టే చెర్రీ.. పండుగ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్​ చేశాడు. ఇందులో సూర్యదయం సమయంలో నవ్వుతూ కనిపించాడు.

'మెగా' సినిమాలో కియారాతో..

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు రామ్‌చరణ్, బాలీవుడ్‌ బ్యూటీ కియారా జోడీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. గతేడాది 'వినయ విధేయ రామ' చిత్రంతో సందడి చేసిందీ జంట. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌గా చెర్రీ, సీతగా కియారా కనువిందు చేశారు. ఈ పాత్రలపై రూపొందించిన 'రామా లవ్స్‌ సీత.. సీత లవ్స్‌ రామా' అనే పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. మళ్లీ ఈ జోడీ మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమైందని సమాచారం.

చిరంజీవి కథానాయకుడుగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రంలో... చెర్రీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులోనే ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో చెర్రీ సరసన కియారా కనిపిస్తుందని సినీ వర్గాల్లో టాక్​. ఈ ఇద్దరిపై ఓ రొమాంటిక్​ పాట కూడా ఉండబోతుందట. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అడవుల్లో ఆర్​ఆర్​ఆర్​..?

మెగా పవర్‌స్టార్‌ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెకక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీంగా తారక్‌ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌పై అరకులో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో రామ్‌చరణ్‌కు సంబంధించిన సన్నివేశాలను వికారాబాద్‌లోని అడవుల్లో చిత్రీకరించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

రామ్‌చరణ్‌పై పదిరోజులపాటు రాత్రి సమయంలో షూటింగ్‌ నిర్వహించనున్నారట. సీతారామరాజు పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు చెర్రీ. ఆదివారం కూడా విరామం లేకుండా జిమ్‌లో సాధన చేస్తున్నాడు. సెలబ్రెటీ ట్రైనర్‌ రాకేశ్‌ ఉడియార్‌ ఆధర్యంలో చెర్రీ శిక్షణ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను చరణ్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా ఆమె కనిపించనున్నారు. మరో కథానాయికగా ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా నటించనుంది. ప్రతినాయకుడిగా హాలీవుడ్‌ నటుడు రే స్టీవెన్‌స్టన్‌... మరో నటి ఎలిసన్‌ డూడీ నటించనున్నారు. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ 70 శాతం పూర్తయ్యిందని చిత్రబృందం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details