తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాబాయ్ ట్రెండ్​నే​ ఫాలో అవుతున్న అబ్బాయ్ - feeding the cattle, goshala pawan kalyan, janasena chief pawan kalyan, newly set Goshala, nurturing and feeding cattle, pawan farmhouse, pawan janasena, pawan kalyan feeding cattle in goshala, pawan kalyan feeding video, pawan kalyan latest, pawan kalyan latest updates, pawan kalyan live news, pawan kalyan spends time in farmhouse, pawan kalyan viral video, Pawan takes time off in his Goshala, plantation of trees

పవర్​స్టార్​ పవన్ ​కల్యాణ్​ బాటలోనే వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు రామ్ ​చరణ్​. వ్యక్తిగతంగా తన బాబాయ్​ ఆదర్శం అని చెప్పిన ఈ మెగాహీరో.. తాజాగా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు.

పవర్​స్టార్​​ ట్రెండ్​నే​ ఫాలో అవుతున్న చెర్రీ

By

Published : Oct 31, 2019, 8:26 PM IST

జనసేన అధినేత, పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌ సెట్​ చేసిన ట్రెండ్​ను ఫాలో అవుతా అంటున్నాడు మెగాహీరో రామ్​ చరణ్​. పవన్​ బాబాయి ఫొటోలను చూసి స్ఫూర్తి పొందా అని వెల్లడించాడు.

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ తన వ్యవసాయ క్షేత్రంలోని గోవులతో సరదాగా గడిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా జనసేన పార్టీ విడుదల చేసింది. ఇవి నెట్టింట వైరల్​ కాగా.. మెగా అభిమానులు గోవుల మధ్య గోపాలుడు అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ కూడా ఇన్‌స్టా వేదికగా పవన్‌ ఫొటోలను షేర్‌ చేశాడు. అంతేకాకుండా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు.

" ఈ ఫొటోలను చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. భవిష్యత్తులో కచ్చితంగా ఓ గోశాలను ప్రారంభిస్తాను. కార్తీకమాసం శుభాకాంక్షలు."
-- రామ్‌ చరణ్‌, సినీ నటుడు

ఈ ఏడాది విడుదలైన 'వినయ విధేయ రామ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్‌ చరణ్‌. ఇటీవల చిరంజీవి ప్రధాన పాత్రలో విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్నాడీ మెగాహీరో. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు రామ్​ చరణ్​. ఇందులో చెర్రీ జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ కనిపించనుంది.

ABOUT THE AUTHOR

...view details