తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భవిష్యత్​లో మరిన్ని అవకాశాలు వస్తాయి: రామ్​చరణ్​ - డిస్నీ హాట్​స్టార్ ఓటీటీ

ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్​స్టార్ సంస్థ.. తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్న హీరో రామ్​చరణ్​ మాట్లాడుతూ.. దీని ద్వారా నటులు, సాంకేతిక వర్గాలకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Ram Charan
రామ్​చరణ్​

By

Published : Sep 19, 2021, 7:18 AM IST

Updated : Sep 19, 2021, 10:28 AM IST

ప్రేక్షకుల అభిరుచి.. వాళ్ల నుంచి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఓటీటీ వేదికలు ప్రాంతీయ భాషలపై దృష్టిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ తెలుగులోకి అడుగుపెట్టింది. ఇటీవల నితిన్‌ కథానాయకుడిగా నటించిన 'మాస్ట్రో' చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లోనే ప్రదర్శితం అవుతోంది. ఈ సంస్థకు ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "తెలుగు వినోద రంగంలోకి డిస్నీ హాట్‌స్టార్‌ ప్రవేశిస్తుండడం వల్ల టాలీవుడ్‌లోని నటులు, సాంకేతిక వర్గాలకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నామ"న్నారు.

డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ కంటెంట్‌హెడ్‌ సౌరవ్‌ బెనర్జీ మాట్లాడుతూ "దేశంలోని కంటెంట్‌ను కొత్త పుంతలు తొక్కించడానికి ఎప్పుడూ ముందు వరసలో ఉంటాం. తెలుగు వినోద ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంద"న్నారు.

ఇదీ చదవండి:SIIMA 2019: ఉత్తమ నటుడిగా మహేశ్‌.. ఉత్తమ చిత్రంగా 'జెర్సీ'

Last Updated : Sep 19, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details