ప్రముఖ టీవీ, సినీ నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి చెందారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల కన్నుమూశారు. ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు.
ప్రముఖ సినీ నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి - actor kosuri venugal death news
ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన 22 రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
సినీ నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి
మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి అనేక సినిమాల్లో నటించిన ఆయన మంచి గుర్తింపు పొందారు. ఇటీవలే అమీతుమీ చిత్రంలో నటించారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు