తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Chiranjeevi Meets AP CM Jagan: జగన్​తో చిరంజీవి భేటీ.. సినిమా టికెట్ల ధరలపై ప్రధానంగా చర్చ - ఏపీలో సినిమా టికెట్ల వివాదం

Chiranjeevi Meets AP CM Jagan : ఏపీలో సినిమా టికెట్ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ను మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. సినిమా టికెట్ల ధరలపై చిరంజీవి సీఎంతో చర్చించారు.

Chiranjeevi Meets AP CM Jagan
జగన్​తో చిరంజీవి భేటీ

By

Published : Jan 13, 2022, 9:41 AM IST

Updated : Jan 13, 2022, 2:49 PM IST

జగన్​తో చిరంజీవి భేటీ

Chiranjeevi Meets AP CM Jagan : ఏపీ సీఎం జగన్‌తో సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. హైదరాబాద్​ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్​పోర్ట్​కు వెళ్లిన చిరంజీవి.. తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్​తో భేటీలో మెగాస్టార్ సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది.

Chiranjeevi Jagan Meeting: అంతకు ముందు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ వచ్చిన చిరంజీవి.. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చినట్లు తెలిపారు. ‘‘సినీ పరిశ్రమ బిడ్డగా ఏపీ సీఎంతో మాట్లాడేందుకు వచ్చా. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను సీఎంతో చర్చిస్తాను. జగన్​తో భేటీ తర్వాత అన్ని విషయాలు చెబుతా. గంటన్నరలో సీఎంతో చర్చించిన విషయాలను మీకు వివరిస్తాను’’ అని చిరంజీవి అన్నారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి చిరంజీవి చేరుకున్నారు.

చిరు-జగన్ మధ్య గంటన్నర పాటు జరిగిన చర్చలో సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం, టికెట్ ధరలపై ప్రధానంగా చర్చించారు. చిత్ర పరిశ్రమపై పలువురు వైకాపా నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం జగన్‌కు దృష్టి చిరంజీవి తీసుకెళ్లనట్లు సమాచారం.

నాగ్ ఏమన్నారంటే..?

చిరంజీవి తన ఒక్కరికోసమే ఏపీ సీఎం జగన్​తో మాట్లాడటానికి వెళ్లటం లేదని అక్కినేని నాగార్జున అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ కోసమే ఈ భేటీ అని స్పష్టం చేశారు. బంగార్రాజు సినిమా విడుదల ఉండటం వల్ల తాను వెళ్లలేకపోయానని చెప్పారు. జగన్‌తో భేటీ ఉంటుందని వారం క్రితమే చిరంజీవి చెప్పారన్న నాగ్.. జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

Last Updated : Jan 13, 2022, 2:49 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details