తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హైదరాబాద్​కు ప్రముఖ నటి కంగనా రనౌత్ - కంగనా రనౌత్ తలైవి సినిమా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ షూటింగ్​ కోసం హైదరాబాద్​కు రానుంది ప్రముఖ నటి కంగనా రనౌత్. ​

kangana-is-coming-to-hyderabad-for-thalaivi-movie-shooting
హైదరాబాద్​కు ప్రముఖ నటి కంగనా రనౌత్

By

Published : Oct 1, 2020, 11:18 AM IST

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్.. హైదరాబాద్​కు రానుంది. 'తలైవి' షూటింగ్ కోసమే భాగ్యనగరానికి విచ్చేస్తున్నట్లు గురువారం ట్వీట్ చేసింది. దాదాపు ఏడు నెలల తర్వాత చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు తెలిపింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

కంగనా రనౌత్ ట్వీట్
తలైవి సినిమాలో కంగనా రనౌత్ లుక్

అంతకు ముందు సుశాంత్ సింగ్ మృతి, బాలీవుడ్​ డ్రగ్స్ కేసులో భాగంగా పలువురు సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది కంగన. ఈ క్రమంలో ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్​తో పోల్చి చర్చనీయాంశమైంది.

అనంతరం ముంబయిలోని ఈమె భవంతి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ నోటీసులు పంపిన బీఎమ్​సీ అధికారులు.. తర్వాతి రోజు పాక్షికంగా దానిని కూల్చివేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకుంది కంగన. అయితే ప్రాణాలకు ముప్పు ఉందనే నేపథ్యంలో కంగనకు వై ప్లస్ సెక్యూరిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details