తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా జీవితంలోకి గొప్ప ఆనందాన్ని తెచ్చావు నిక్​' - ప్రియాంకా చోప్రా లేటెస్ట్​ న్యూస్​

రెండేళ్ల క్రితం ఇదే రోజున తన జీవితంలోకి కొత్త ఆనందం వచ్చిందని వెల్లడించింది బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా. ఈ సందర్భంగా తన భర్త నిక్ జోనస్​తో దిగిన ఓ సెల్ఫీని షేర్​ చేసింది.

'To the greatest joy of my life', Priyanka pens heartfelt note for hubby Nick
'నా జీవితంలోకి గొప్ప ఆనందాన్ని తెచ్చావు నిక్​'

By

Published : Jul 20, 2020, 6:46 PM IST

తన భర్త నిక్​ జోనస్​ రెండేళ్ల క్రితం చేసిన వివాహ ప్రతిపాదనను తాజాగా గుర్తు చేసుకుంది బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. సోషల్​మీడియాలో వారిద్దరు దిగిన ఓ అందమైన సెల్ఫీని పోస్ట్​ చేస్తూ.. రెండేళ్ల క్రితం తనకు వచ్చిన వివాహ ప్రతిపాదనను తాజాగా జ్ఞాపకం తెచ్చుకుంది.

"రెండేళ్ల క్రితం ఇదే రోజున మీరు నన్ను వివాహం చేసుకోమని అడిగారు. నాకు అప్పుడు మాటలు రాలేదు. కానీ అప్పటి నుంచి ప్రతి రోజు మిమ్మల్ని అంగీకరిస్తూనే ఉన్నా. మీరు నా జీవితంలోకి వస్తూ గొప్ప ఆనందాన్ని తీసుకువచ్చారు. చాలా రోజుల తర్వాత మీరు ఈ వారాంతాన్ని గుర్తిండిపోయేలా చేశారు. ప్రతిరోజు నా గురించి ఆలోచించడానికి మీ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే నేను అదృష్టవంతురాలిని. నేను నిన్ను ప్రేమిస్తున్నా నిక్​​."

-ప్రియాంకా చోప్రా, బాలీవుడ్​ నటి

ఈ పోస్ట్​పై స్పందించిన సింగర్​ నిక్​ జోనస్​ తన వివాహ ప్రతిపాదనకు అంగీకరించినందుకు ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపాడు. జోధ్​పుర్​లోని ఉమైద్​ భవన్​ ప్యాలెస్​లో రెండేళ్ల క్రితం రెండు మతాల సంప్రదాయల ప్రకారం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. 2018 డిసెంబరు 1న క్రైస్తవ, డిసెంబరు 2న హిందూ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దిల్లీ, ముంబయిలో రిసెప్షన్లు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details