తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ చెప్పలేనంత వేదన మిగిల్చాడు' - రియా చక్రబోర్తి సుశాంత్​ సింగ్​

సుశాంత్​ మృతితో మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నట్లు చెప్పిన నటి రియా చక్రవర్తి.. తన మనసులో అతడిపై లెక్కలేనంత ప్రేమ దాగుందని వెల్లడించింది.

Sushant Singh Rajput
రియా చక్రబోర్తి

By

Published : Jul 14, 2020, 2:25 PM IST

సుశాంత్​ సింగ్​పై తన మనసులో అనంతమైన ప్రేమ ఉందని చెప్పింది నటి రియా చక్రవర్తి. అయితే ఆత్మహత్య చేసుకుని తనకు చెప్పలేనంత వేదన మిగిల్చాడని తెలిపింది. కానీ ఎప్పటికీ అతడితో కలిసి ఉన్నట్లు భావిస్తానంది. సుశాంత్​ లేడని తెలిసినప్పటినుంచి తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నానని బాధను వ్యక్తం చేసింది.

" నా మనసులోని ఈ బాధను ఎవరు చెరిపేయలేరు. సుశాంత్, నువ్వు నాకు​ ప్రేమ విలువ తెలిసేలా చేశావు. జీవిత పరమార్థం అర్ధమయ్యేలా చేశావు. నీ దగ్గర నేర్చుకున్న, తెలుసుకున్న ప్రతి విషయం నా జీవితాంతం అమలు చేస్తాను"

-రియా చక్రవర్తి, నటి

సుశాంత్​కు ఖగోళశాస్త్రం పట్ల ఉన్న అభిరుచిని తెలిపింది రియా. షూటింగ్​ స్టార్​గా అతడిని అభివర్ణించింది.

"ఇప్పుడు నువ్వు మరింత ప్రశాంతంగా ఉన్నావని తెలుసు. చంద్రుడు, నక్షత్ర మండలాలు అతడిని 'గొప్ప శాస్త్రవేత్తగా' ఆహ్వానించాయి. వాటి మధ్య ఓ షూటింగ్​ స్టార్​లా ఆనందాన్ని ఆస్వాదిస్తూ వెలుగుతూ ఉండు. ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి వస్తావని, నీ కోసం ఎదురుచూస్తుంటాను"

-రియా చక్రవర్తి, నటి

సుశాంత్​, తనకు మధ్య ఉన్న ప్రేమను ఇంతకంటే మాటల్లో చెప్పలేనని తెలిపింది రియా. తమ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ శాశ్వతమైనదని వెల్లడించింది.

రియా చక్రబోర్తి

హాలీవుడ్​ చిత్రాల్ని అధిగమించిన ట్రైలర్

మూడేళ్ల క్రితమే సుశాంత్​ 'దిల్​ బెచారా' షూటింగ్​ ప్రారంభమైనా, విడుదల ఇప్పటికి కుదిరింది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్.. ప్రపంచంలోనే అత్యధిక లైకులు(ప్రస్తుతం 10 మిలియన్లకు పైగా) సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రచార చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా, కరోనా ప్రభావంతో థియేటర్లకు బదులు ఓటీటీ(డిస్నీ ప్లస్ హాట్​స్టార్)లో జులై 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ యాప్​ ఉన్న ప్రతిఒక్కరూ ఉచితంగా వీక్షించొచ్చు.

ఇది చూడండి :ట్రైలర్​తో సుశాంత్ 'దిల్​ బెచారా' రికార్డు.. మరి సినిమా?

ABOUT THE AUTHOR

...view details