తమిళులను దుర్మార్గులుగా, లిబరేషన్ టైగర్ ఫర్ తమిళ ఈలం (ఎల్టీటీఈ)ని ఉగ్రవాదులుగా చూపారంటూ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్‌పై ఆ రాష్ట్రంలో వివాదం చెలరేగుతోంది. తమిళుల మనోభావాలను దెబ్బతీసిన కారణంగా సదరు వెబ్‌సిరీస్ రిలీజ్‌ను నిలిపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఐటీ, ప్రసార మంత్రిత్వశాఖను కోరింది. దీంతో ఆ సిరీస్ విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పేయ్.. తమిళ సంస్కృతి, గౌరవాన్ని కించపరచకుండా చాలా జాగ్రత్తగా రూపొందించామని అన్నారు.
"మా వెబ్‌సిరీస్ కోసం చాలా మంది తమిళులు పనిచేశారు. ప్రధానంగా దర్శకులు రాజ్&డీకే, సమంత, ప్రియమణి, సమన్తోపాటు కొందరు రచయితలు ఆ ప్రాంతానికి చెందినవారే. వాళ్ల కంటే ఎక్కువగా తమిళుల ప్రయోజనాలను ఎవరు కాపాడతారు. తమిళ సంస్కృతి, గౌరవం, మనోభావాలను దెబ్బతీయరని నేను నమ్ముతున్నాను".
- మనోజ్ బాజ్‌పేయ్, బాలీవుడ్ నటుడు