ఈ ఏడాది.. పలు క్రేజీ ప్రాజెక్టులు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్‌ల సినిమాలు ఉన్నాయి. అవన్నీ భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం వాటి టైటిల్స్ విషయంలో ఓ వార్త ఆసక్తి రేపుతోంది. సంబంధిత నిర్మాణ సంస్థలు.. ఫిల్మ్ ఛాంబర్లో ఈ చిత్రాలకంటూ కొన్ని పేర్లను రిజిస్టర్ చేశాయి. మరి ఇవి వర్కింగ్ టైటిల్స్‌గా ఉపయోగిస్తారా? లేదా ఒరిజినల్ టైటిల్స్‌గా పెడతారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
'పింక్' తెలుగు రీమేక్‌తో పవన్ సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నాడు. దీనికి తొలుత 'లాయర్ సాబ్' అనే పేరు పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు అది నిజం కాదని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్‌రాజు.. 'వకీల్ సాబ్' పేరును రిజిస్టర్ చేయించారని టాక్.