తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీవిష్ణు మీసం తిప్పేది ఆ రోజే..!

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు కొత్త చిత్రం 'తిప్పరా మీసం'. ఈ సినిమా నవంబరు 8న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 'అసుర' ఫేమ్ ఎల్​.కృష్ణ విజయ్ ఈ సినిమాకు దర్శకుడు.

By

Published : Oct 27, 2019, 9:26 AM IST

తిప్పరా మీసం

విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. అతడి తాజా చిత్రం 'తిప్పరా మీసం'. ఇందులో నిక్కీ తంబోలి కథానాయిక. ఈ సినిమాను నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది.

"అసుర సమయం నుంచే విజయ్‌తో నాకు పరిచయం ఉంది. అప్పట్లోనే ఇద్దరం ఓ మంచి సినిమా చేద్దాం అనుకున్నాం. 'నీదీ నాదీ ఒకే కథ', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడొక మంచి కథతో మళ్లీ దర్శకుడిగా మారి నా దగ్గరకొచ్చాడు. ఈ చిత్ర కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. ఇలాంటి బృందంతో కలిసి పనిచేయడం సంతోషాన్నిచ్చింది" - శ్రీవిష్ణు, సినీ హీరో.

ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నాడు. సురేష్ బొబ్బిలి సంగీతమందిచాడు. 'అసుర' ఫేమ్ ఎల్​.కృష్ణ విజయ్ దర్శకత్వం వహించాడు.

ఇదీ చదవండి: ఆ కన్నుల్లో మాయ ఉంది.. నిను వీడి పోనంది

ABOUT THE AUTHOR

...view details