తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కోర్టులో సత్యదేవ్​.. పోలవరానికి వచ్చిన స్వీటీ - సామ్​ జామ్​లో తమన్నా

కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. యువ కథానాయకుడు సత్యదేవ్​ నటిస్తున్న 'తిమ్మరుసు' సినిమా టీజర్​​తో పాటు 'ఖిలాడి', 'జంగిల్​' మూవీ అప్​డేట్స్​ వచ్చాయి. మరోవైపు పోలవరంలోని ఓ ఆలయాన్ని స్టార్​ హీరోయిన్​ అనుష్క సందర్శించారు.

Timmarusu movie teaser released.. actress Anushka Shetty visits polavaram
కోర్టులో సత్యదేవ్​.. పోలవరానికి వచ్చిన స్వీటీ

By

Published : Dec 9, 2020, 8:00 PM IST

Updated : Dec 9, 2020, 9:45 PM IST

టాలీవుడ్​ విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'తిమ్మరుసు'. సత్యదేవ్​ ఇందులో న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను దర్శకుడు పూరీ జగన్నాధ్​ బుధవారం సోషల్​మీడియాలో విడుదల చేశారు.

అగ్ర కథానాయిక అనుష్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. పంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సన్నిహితులతో కలిసి పడవలో గోదావరి నది దాటిన ఆమె ముఖానికి మాస్కు ఉండటం వల్ల స్థానికులు వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంతితో కలిసి స్వీటీ కనిపించారు. చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఉన్నప్పటికీ ఎటువంటి ఆడంబరం లేకుండా ఆమె వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మాస్​ మహారాజ్​ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం 'ఖిలాడి'. రమేశ్​ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్​ డైరెక్టర్​ దేవీశ్రీప్రసాద్​తో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్​ సిట్టింగ్​ల కోసం దర్శకుడు చెన్నై వెళ్లారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్​ ఇటీవలే పూర్తయ్యింది. రవితేజ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు.

స్టార్​ హీరోయిన్​ సమంత హోస్ట్​గా నిర్వహిస్తున్న టాక్​ షో 'సామ్​ జామ్​'. ఆహా ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్​ తమన్నా హాజరైంది. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్​మీడియాలో పంచుకున్నారు.

ఆది సాయికుమార్​, వేదిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'జంగిల్​'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేయనుంది. కార్తిక్​-విఘ్నేశ్​ దర్శకత్వం వహిస్తుండగా.. మహేశ్​ గోవిందరాజు, అర్చన చంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

గోదావరిలో అనుష్క పడవ ప్రయాణం
నందీశ్వరాలయానికి సందర్శించిన నటి అనుష్క
దర్శకుడు రమేశ్​ వర్మతో మ్యూజిక్​ డైరెక్టర్​ దేవీశ్రీప్రసాద్​​
'సామ్​ జామ్​' కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా
జంగిల్​ టీజర్​ విడుదల తేదీ పోస్టర్​
Last Updated : Dec 9, 2020, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details