మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ప్రతి విషయాన్ని అభిమానులకు పంచుతూ సందడి చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ కాలంలో ఎన్నో విషయాలు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వైవిధ్యమైన ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలకి .. "తాను..నేను. కాలం మారినా.. దేశం మారినా ... మేం మాత్రం అలా ఎప్పటిలాగే ఉన్నాం" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
'అన్నీ మారాయి.. కానీ మేం మాత్రం' - chiranjeevi shared a old photo
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి మరోసారి నెట్టింట వైరల్గా మారారు.
చిరంజీవి
1990లో అమెరికా వెళ్లినపుడు అక్కడ చిరు వంట చేస్తున్న ఫొటోను.. ప్రస్తుతం సొంతింట్లో వంట చేస్తున్న ఫొటోను చూస్తుంటే.. చాలా ముచ్చటగా ఉన్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య'లో నటిస్తున్నారు. ఇందులో తనయుడు రామ్ చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని సమాచారం. కాజల్ కథానాయికగా నటిస్తోంది.