దేశంలో కరోనా కారణంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రధానంగా ముంబయిలో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. నగరంలో దశాబ్దాలుగా వేలాది మందికి భోజనం అందిస్తున్న డబ్బావాలాల జీవనోపాధి కరోనా ధాటికి పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా ముందుకొచ్చి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు.
లాక్డౌన్ వేళ ప్రభుత్వం డబ్బావాలాలకు సాయం చేస్తుందని రాష్ట్ర మంత్రి అస్లాం షేఖ్ చేసిన ట్వీట్‌ను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు సంజయ్.