టిక్‌టాక్.. ఈ యాప్ యువతకు ఓ వరంగా మారింది. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఓ వేదికలా తయారైంది. అందుకే చాలా మంది ఈ యాప్‌ను సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే, అజయ్ దేవ్‌గణ్, కాజోల్, ఆలియా భట్, శ్రీదేవి లాంటి తారాగణాన్ని పోలిన వారు సందడి చేస్తున్నారు. తాజాగా అలనాటి నటి మధుబాలను పోలిన ఓ యూజర్ టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైంది.
టిక్‌టాక్ మధుబాల.. అవకాశం ఎలా..! - tiktok madhubala
అలనాటి బాలీవుడ్ నటి మధుబాలను పోలిన ఓ యూజర్ టిక్‌టాక్‌లో సందడి చేస్తోంది. తనకు సినిమాల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు వీక్షకులు.
సినిమా
ఈమె అసలు పేరు ప్రియాంక కొండ్వాల్. టిక్‌టాక్ మధుబాలగా గుర్తింపు పొందింది. అచ్చం ఆ నటిలానే ఉన్న ప్రియాంకకు ఫాలోవర్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో ఓ అవకాశం ఇప్పించాలని ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్‌కు సూచిస్తున్నారు మరికొందరు సినీ ప్రియులు.
ఇవీ చూడండి.. 23 వసంతాల పవన్ సినీ ప్రస్థానం..