ఆదివారం రాత్రి బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, టైగర్ష్రాఫ్, అపర్శక్తి ఖురానా, అహన్ శెట్టి తదితరులు ఛారిటీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. ఓ సమయంలో కాలికి దెబ్బ తగలడం వల్ల టైగర్ మిగతా మ్యాచ్ ఆడలేకపోయాడు. అది చాలా చిన్న గాయమేనని వైద్యుడు పరీక్షల అనంతరం వెల్లడించారు. దీంతో అతడు స్ట్రైచర్పై ఉన్నంత సేపు రూమర్ ప్రేయసి దిశా పటానీ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంది.
ఫుట్బాల్ ఆడుతూ గాయపడ్డ బాలీవుడ్ హీరో - movie news
బాలీవుడ్ హీరో టైగర్ష్రాఫ్.. ఛారిటీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. హీరోయిన్ దిశా పటానీ.. ఆ సమయంలో అతడితో పాటే ఉండి జాగ్రత్తగా చూసుకుంది.
టైగర్ష్రాఫ్ దిశా పటానీ
ప్రస్తుతం 'గణపత్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు టైగర్ష్రాఫ్. ఇందులో కృతిసనన్ హీరోయిన్. మరోవైపు 'హీరోపంతి' సీక్వెల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో తారా సుతారియా కథానాయికగా నటించనుంది.