'హీరోపంతి'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన టైగర్‌ష్రాఫ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో పాటు, డ్యాన్స్, ఫైట్స్‌తో అభిమానులను ఫిదా చేశారు. ఈ మధ్యే 'అన్బిలీవబుల్' వీడియో సాంగ్‌తో గాయకుడిగానూ తన ప్రతిభ చూపించారు. విడుదలైన 24 గంటల్లోనే అన్ని మాధ్యమాల్లో కలిపి 140 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. దీనిపై స్పందించిన టైగర్.. తనను ఎంతో ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
" కొత్తదనాన్ని స్వాగతించి, ప్రేక్షకులు ఎంతో ప్రేమ కురిపించడం నిజంగా 'అన్బిలీవబుల్'. నేను ఎప్పటికీ కోరుకునేది ఇదే. ఈ ప్రయత్నానికి అద్భుత ప్రతిఫలం దొరికినట్లు అనిపించింది. ప్రజల్లో దాగున్న ప్రతిభను వెలికితీయడానికి వారిని ప్రోత్సహించేందుకు నేను చిన్న ప్రయత్నం చేశాను"