తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టైగర్ 3' కోసం విదేశాలకు సల్మాన్, కత్రిన! - సల్మాన్, కత్రినా సినిమా జాబితా

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​, కత్రినాకైఫ్​ జంటగా నటిస్తోన్న కొత్త చిత్రం 'టైగర్​ 3' . ఈ మూవీ పోరాట సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్రబృందం రష్యాకు బయలుదేరి వెళ్లనుంది.

టైగర్
టైగర్

By

Published : Aug 16, 2021, 10:40 PM IST

2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్'కు కొనసాగింపుగా వస్తున్న 'టైగర్ 3' షూటింగ్ విదేశాల్లో జరగనుంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్​ - కత్రినా కైఫ్​లతో పాటు సినిమా బృందం​ రష్యాకు తరలివెళ్లనుంది. గతంలో కరోనా విజృంభణ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఆగస్టు 18న రష్యా వెళ్లనున్న ఈ యూనిట్.. 45 రోజుల పాటు విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. సల్మాన్, కత్రినాలపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. రష్యాతో పాటు ఆస్ట్రియా, టర్కీ సహా మరో 5 అంతర్జాతీయ లొకేషన్లలో చిత్రీకరణను జరపనున్నారు. ఇదివరకెన్నడూ చూడని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని చిత్రబృందం పేర్కొంది.

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ నటించిన స్పై థ్రిల్లర్ సినిమాలో మూడో భాగంగా 'టైగర్ 3' తెరకెక్కుతోంది. దీనికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్​లో మొదటగా 2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్'కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగం 'టైగర్ జిందా హై' 2017లో విడుదలైంది. దీనికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details