తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR movie: 'ఆర్ఆర్ఆర్' టికెట్ ధర ఎంతంటే? - RRR ticket rate

TFPC meeting: తెలంగాణ ప్రభుత్వం జీవో నం 120 ప్రకారం చిన్న సినిమాల టికెట్లను అందుబాటు ధరలోనే అమ్మాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.

RRR movie
ఆర్ఆర్ఆర్ మూవీ

By

Published : Dec 31, 2021, 5:38 PM IST

Movie ticket rates: తెలంగాణలో విడుదలయ్యే చిన్న సినిమాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలోనే టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ఇటీవల టికెట్ ధరలను సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఎవరు ఉల్లంఘించవద్దని థియేటర్ యాజమాన్యాలకు సూచించింది.

శుక్రవారం విడుదలైన చిన్న చిత్రాలకు పలు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరలు ఎక్కువగా పెంచారనే ఫిర్యాదులపై స్పందించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్.. తన కార్యవర్గ సభ్యులతోపాటు, పలు థియేటర్ యాజమాన్యాలతో చర్చించారు. చిన్న సినిమాలకు ధరలు పెంచి అమ్ముతున్న థియేటర్లు వెంటనే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

సునీల్ నారంగ్

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత విడుదలయ్యే ప్రతి చిన్న సినిమాకు కనిష్టంగానే ధరలు ఉంటాయని సునీల్ నారంగ్ పేర్కొన్నారు. అలాగే థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఫిల్మ్ ఛాంబర్ సమక్షంలో ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ప్రైవేటు పోర్టల్ ద్వారా టికెట్ల విక్రయాలు భారం అవుతున్నప్పటికి తప్పని పరిస్థితుల్లో అమలు చేస్తున్నామని సునీల్ నారంగ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లోనూ టికెట్ ధరల వివాదం త్వరలోనే ముగుస్తుందని ఆకాంక్షించారు.

సినిమా థియేటర్

'ఆర్‌ఆర్‌ఆర్‌'కు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.175, మల్టీప్లెక్స్‌లో అయితే రూ.295 టికెట్‌ ధర ఉంటుంది. అన్ని థియేటర్లు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని మేం ఇప్పటికే చెప్పాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకపోతే ఆ థియేటర్‌ని సీల్‌ చేస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది అని సునీల్ నారంగ్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details