తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ ముగ్గురు హాస్యనటులు హీరోలుగా మారారు..! - ram prasad

సుడిగాలి సుధీర్, రామ్​ప్రసాద్, గెటప్ శీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'త్రీమంకీస్' ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'త్రీమంకీస్' ఫస్ట్​లుక్

By

Published : Sep 22, 2019, 4:09 PM IST

Updated : Oct 1, 2019, 2:20 PM IST

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో 'జబర్దస్త్'. ఇందులో గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు హాస్యనటులుసుడిగాలి సుధీర్, ఆటో రామ్​ప్రసాద్, గెటప్ శీనుహీరోలుగా మారారు. ప్రస్తుతం 'త్రీ మంకీస్'​ అనే సినిమాలో ప్రధాన పాత్రల్లోనటిస్తున్నారు. ఆదివారం ఫస్ట్​లుక్ విడుదలైంది.

త్రీ మంకీస్ ఫస్ట్​లుక్

ఈ సినిమాలో హీరోయిన్స్​గా ఎవరు కనిపించనున్నారనే విషయం తెలియాల్సి ఉంది. అనిల్ కుమార్ సంగీతమందిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. ఓరుగల్లు సినీ క్రియేషన్స్​ పతాకంపై జి.నాగేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి: బాక్సాఫీస్​ ఊపిరి పీల్చుకో.. 'సైరా' వస్తున్నాడు

Last Updated : Oct 1, 2019, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details