తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి : రియా - రియాకు ప్రాణహాని

తనతో పాటు తన కుటంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని హీరోయిన్ రియా చక్రవర్తి చెప్పింది. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించగా, వారు పట్టించుకోలేదని ఆరోపించింది.

Rhea
రియా

By

Published : Aug 27, 2020, 7:41 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి.. తనతో సహా తన కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పింది. రక్షణ కల్పించాలని పోలీసులను, దర్యాప్తు అధికారులను కోరినప్పటికీ వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె ఇన్​స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో రియా తండ్రిని మీడియా ప్రతినిథులు చుట్టుముట్టి ప్రశ్నలు కురిపిస్తున్నారు.

"మేము ఇల్లు దాటి బ‌య‌ట‌కు వ‌చ్చి ఈడీ, సీబీఐ స‌హా ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ విచార‌ణ‌కు స‌హ‌క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. కానీ నాతో పాటు, నా కుటుంబ స‌భ్యుల జీవితం ప్ర‌మాదంలో ఉంది. మాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పోలీసులను, ద‌ర్యాప్తు అధికారుల‌ను కోరాం. ఎవ‌రూ మాకు సాయం చేయ‌లేదు. మేం ఎలా ముందుకువెళ్లాలి? కేవ‌లం విచార‌ణ‌కు వెళ్లేందుకు మాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అడుగుతున్నాం. ఈ విష‌యంలో మాకు ఎలాగైనా సాయం చేయాల‌ని ముంబయి పోలీసుల‌ను అభ్య‌ర్థిస్తున్నాను" అని రియా తెలిపింది.

సుశాంత్ మృతి కేసులో సీబీఐ, మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ, నిషేధిత మాద‌క ద్ర‌వ్యాల కేసులో ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో‌) రియాను విచారిస్తున్నాయి.

ఇది చూడండి ఎస్పీ బాలుకు ఫిజియోథెరఫీ చికిత్స

ABOUT THE AUTHOR

...view details