తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ 'రాధేశ్యామ్': 1000 మంది... 100 రోజులు

ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ చిత్రంలోని యాక్షన్​ సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూల్​ పూర్తైంది. దీని గురించి చిత్ర దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ.. " దాదాపు వెయ్యి మంది వంద రోజులు నిర్విరామంగా పనిచేశారు" అని అన్నారు.

Radhe syam movie
రాధేశ్యామ్

By

Published : Dec 9, 2020, 6:26 AM IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న 'రాధేశ్యామ్'‌ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటోంది. నెల రోజులుగా సాగుతున్న ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. ఇందులో కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన నిక్‌ పావెల్‌ నేతృత్వంలో తెరకెక్కించారు. అందుకు సంబంధించిన విషయాల్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

"రెండేళ్లుగా కంటున్న ఈ కల నెరవేరడానికి దాదాపు వెయ్యి మంది వంద రోజులు నిర్విరామంగా పనిచేశారు. మునుపెన్నడూ లేని రీతిలో సాహసాల్ని చేసిన నిక్‌పావెల్‌ ఆయన బృందానికి కృతజ్ఞతలు" అని ట్వీట్‌ చేశారు రాధాకృష్ణకుమార్‌. ఈ సన్నివేశాల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో కళా దర్శకుడు రవీందర్‌ నేతృత్వంలో భారీ సెట్స్‌ను తీర్చిదిద్దారు. ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌ ఘట్టాలకూ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయిక పూజా హెగ్డే. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి : ప్రభాస్​ కొత్త చిత్రం 'సలార్​' కథాంశం ఇదేనా!

ABOUT THE AUTHOR

...view details