తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పవన్​ ఈ ఏడాది మామిడి పండ్లు పంపలేదు' - పవన్​ కల్యాణ్​ నాకు మామిడి పండ్లు ఇవ్వలేదు

ప్రతిఏటా తనకు మామిడి పండ్లు పంపే పవన్ ​కల్యాణ్​ ఈ ఏడాది పంపలేదని అన్నారు హాస్యనటుడు అలీ. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్లే పంపించి ఉండరని తెలిపారు. తాజాగా పవన్​తో ఉన్న బంధంపై పలు విషయాలు పంచుకున్నారు.

pawan-ali
పవన్​-అలీ

By

Published : Jun 2, 2020, 5:12 PM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏటా తనకు ఆర్గానిక్‌ మామిడి పండ్లు పంపేవారని, ఈ ఏడాది ఇంకా పంపలేదని సినీ నటుడు అలీ అన్నారు. పవన్‌తో తనకున్న అనుబంధం గురించి తాజాగా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో మాట్లాడారు. చిరంజీవి కుటుంబానికి తనంటే ఎంతో ఇష్టమని ఫంక్షన్‌ జరిగినా తనని పిలుస్తారని చెప్పుకొచ్చారు.

"అన్నయ్య చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు పవన్‌ కల్యాణ్‌ అక్కడ ఉండేవారు. అప్పటికి ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. సరదాగా సినిమా కబుర్లు చెప్పుకునే వాళ్లం. పవన్‌ తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి'తో పాటు గతంలో 'అజ్ఞాతవాసి' మినహా ఆయన నటించిన అన్ని చిత్రాల్లో నటించా. 'తొలి ప్రేమ' నుంచి మా జర్నీ బాగా సాగింది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం 'కాటమరాయుడు'.

"మిమ్మల్ని చూడగానే పవన్‌ పగలబడి నవ్వుతారెందుకు" అని చాలామంది అడుగుతారు. మా ఇద్దరి మధ్య కొన్ని సైగలు ఉంటాయి. అవి ఆయనకు మాత్రమే అర్థమవుతాయి. అందుకే ఆయన నవ్వుతారు. బ్రహ్మానందంగారంటే కూడా బాగా ఇష్టం. చిరంజీవిగారింట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా నన్ను, బ్రహ్మానందంగారిని తప్పకుండా పిలుస్తారు. ప్రతి సంవత్సరం చిరంజీవిగారు ఇంటి ఆవకాయ పంపిస్తారు. పవన్‌ కల్యాణ్‌గారు ఆర్గానిక్ ‌మామిడి పండ్లు పంపేవారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది నాకు పంపలేదు. వచ్చే ఏడాది పంపుతారేమో చూడాలి" అని అలీ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి : సల్మాన్​తో ఐశ్వర్య, కరీన.. ఎవరి జోడీ పాపులర్!

ABOUT THE AUTHOR

...view details