తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ ఏడాది నా పుట్టినరోజు వేడుకలు జరపొద్దు' - రామ్ పోతినేని తాజా వార్తలు

రాబోయే తన జన్మదిన వేడుకలను జరపొద్దని అభిమానుల్ని కోరారు యువహీరో రామ్. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వేడుకలకు దూరంగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

రామ్
రామ్

By

Published : May 13, 2020, 1:41 PM IST

రాబోయే తన జన్మదిన వేడుకలు జరపొద్దని అభిమానుల్ని కోరారు యువ కథానాయకుడు రామ్‌ పోతినేని. మే 15న ఆయన జన్మదినం. కానీ, ఈసారి కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలంటూ ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు రామ్‌.

"మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టినరోజును మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. నాపై మీరెంత ప్రేమ చూపిస్తుంటారో.. అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటా. మీ ఆరోగ్యం, మీ సంతోషం నాకు ముఖ్యం. అందుకే ఈ విపత్కర పరిస్థితుల రిత్యా ఈసారి నా పుట్టినరోజు వేడుకలకు మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం. ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే.. నాకు ఇచ్చే అసలైన జన్మదిన కానుకగా భావిస్తా."

-రామ్, హీరో

ప్రస్తుతం రామ్​ 'రెడ్​' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లు. ఏప్రిల్​లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details