తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే! - ఈ వారం విడుదలయ్యే సినిమాలు

This week upcoming telugu movies: బాలకృష్ణ 'అఖండ' విజయంతో చిత్రసీమలో జోరు పెరిగింది. ఈ క్రమంలోనే బడా హీరోల సినిమాలు రిలీజ్​కు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల మూడో వారంలో థియేటర్​ లేదా ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలేవో తెలుసుకుందాం.

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Dec 13, 2021, 2:03 PM IST

This week upcoming telugu movies: కరోనా నుంచి కోలుకున్న చిత్ర పరిశ్రమలో అసలైన జోష్​ ఇప్పుడే మొదలైంది. బాలకృష్ణ ఇచ్చిన 'అఖండ' విజయంతో మరింత ఉత్సాహంగా ముందుకు దూసుకెళ్తోంది. రాబోయే కొద్దిరోజుల్లో భారీ బడ్జెట్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబరు మూడో వారంలో థియేటర్‌ లేదా ఓటీటీలో వచ్చే చిత్రాలేవో చూసేద్దామా!

'స్పైడర్‌ మ్యాన్‌' వచ్చేస్తున్నాడు!

Spider man release date: చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆస్వాదించే సూపర్‌ హీరో పాత్ర 'స్పైడర్‌ మ్యాన్‌'. చేతుల్లో నుంచి దారాలను వదులుతూ అతను చేసే సాహసాలు అలరిస్తాయి. మరోసారి అలా అలరించేందుకు సిద్ధమయ్యాడు స్పైడర్‌ మ్యాన్‌. జాన్‌ వాట్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ 'స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌'(Spider Man No Way Home). టామ్‌ హోలాండ్‌, జందాయా, బెనిడిక్ట్‌ కంబర్‌బ్యాచ్‌, జాకబ్‌ బ్యాట్‌లాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భూమిని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువులు ఎవరు? వారిని స్పైడర్‌ మ్యాన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అందుకు డాక్టర్స్‌ స్ట్రేంజ్‌ సాయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డిసెంబరు 16న ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ విడుదల కానుంది.

వారం రోజుల్లో.. థియేటర్లలో ‘పుష్ప’రాజ్‌ మాస్‌ జాతర

Pushpa movie release date: 'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు' అంటూ ఈ వింటర్‌లో హీటు పుట్టించేందుకు వస్తున్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన హీరోగా సుకుమార్‌(sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్ థ్రిల్లర్‌ 'పుష్ప'. రష్మి కథానాయిక. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ 'పుష్ప ది రైజ్' డిసెంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ, అజయ్‌ఘోష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మరోవైపు 'ఆర్య', 'ఆర్య-2' తర్వాత సుకుమార్‌-బన్ని కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక అగ్ర కథానాయిక సమంత ఈ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో కనిపించనుండటం విశేషం. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ‘పుష్ప’ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే రూ.250 కోట్ల వ్యాపారం జరిగినట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబరు 17 నుంచి వారం రోజుల పాటు థియేటర్‌లో కేవలం పుష్పరాజ్‌ మాస్‌ పార్టీ సందడి మాత్రమే కొనసాగనుంది.

ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ఓటీటీలో రాజ్‌ తరుణ్‌ 'అనుభవించు రాజా'

Anubhavinchu Raja release date: రాజ్‌ తరుణ్ కథానాయకుడిగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అనుభవించు రాజా’. కశిష్‌ఖాన్‌ కథానాయిక. నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో డిసెంబరు 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో రాజ్‌తరుణ్‌ బంగారం అలియాస్‌ రాజు పాత్రలో నటించాడు. ఊళ్లో జల్సారాయుడిగా తిరిగే రాజు సిటీలో సెక్యూరిటీ గార్డుగా ఎందుకయ్యాడు? ఊళ్లో జరిగిన హత్యకు రాజుకూ సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! రాజ్‌ తరుణ్‌ నటన, కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా పర్వాలేదనిపించింది.

సోనీ లివ్‌

ది విజిల్‌ బ్లోయర్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 16

నెట్‌ఫ్లిక్స్‌

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 17

ది విచ్చర్‌ (వెబ్‌ సిరీస్‌) డిసెంబరు 17

కడశీల బిర్యాని (తమిళ్‌) డిసెంబరు 17

జీ5

420 ఐపీసీ(హిందీ) డిసెంబరు 17

ఇదీ చూడండి: 'ప్రాజెక్ట్​ కే' తొలి షెడ్యూల్​ పూర్తి.. 'హనుమాన్'​ సర్​ప్రైజ్

ABOUT THE AUTHOR

...view details