తెలంగాణ

telangana

ETV Bharat / sitara

This week movies: ఈ వారం రిలీజయ్యే సినిమాలివే!

This week release movies: కరోనా కారణంగా వాయిదా పడిన పెద్ద చిత్రాలు ఒక్కొక్కటిగా బాక్సాఫీస్‌ వద్దకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో మార్చి రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూసేయండి

radheyshyam
రాధేశ్యామ్​

By

Published : Mar 7, 2022, 10:43 AM IST

This week release movies: ప్రభాస్​ 'రాధేశ్యామ్​', సూర్య 'ఈటీ' సహా పలు చిత్రాలు ఈ వారం విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ మూవీస్​ ఏంటో చూసేద్దాం..

సూర్య 'ఈటీ'

Suriya ET release date: ‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘కోటు వేసుకునే జడ్జి వేరే.. పంచె ఎగ్గడితే నేనేరా జడ్జిని’, ‘అమ్మాయిలు అంటే బలహీనులు అనుకుంటారు. బలవంతులు అని నిరూపించాలి’ వంటి డైలాగ్‌లు అలరిస్తున్నాయి. ఎవరికి జరిగిన అన్యాయం కోసం సూర్య పోరాటం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తెలియాలంటే ‘ఈటీ’ చూడాల్సిందే!

'రాధేశ్యామ్‌'

Prabhas Radhyshyam release date: విధితో పోరాటం చేసిన ఓ జంట ప్రేమకథ ఎలాంటిదో తెలియాలంటే తమ సినిమా చూడాల్సిందే అంటున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్ . రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన పాన్‌ ఇండియా లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, ప్రసీధ నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పకులు. వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు మార్చి 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరులో ఏది గెలిచిందన్న ఆసక్తికరం. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్‌ కనిపించనున్నారు. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు/సిరీస్‌లు

నేరుగా ఓటీటీలోకి ‘మారన్‌’

Dhanush Maran movie: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్ ఇప్పుడు ‘మారన్‌’ చిత్రంతో అలరించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రాబోతున్న ఈ తమిళ చిత్రానికి కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించారు. మాళవిక మోహనన్‌ కథానాయిక. డిస్నీ హాట్‌స్టార్‌లో మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ధనుష్‌ జర్నలిస్టుగా కనిపించనున్నారు.

స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఆది ‘క్లాప్‌’

ఇటీవల కాలంలో క్రీడా నేపథ్యంలో సాగే కథలతో సినిమాలు తరచూ బాక్సాఫీస్‌ను పలకరిస్తున్నాయి. అలా ఆది పినిశెట్టి కథానాయకుడిగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం‘క్లాప్‌’. ఆకాంక్షసింగ్‌ నాయిక. రామాంజనేయులు జవ్వాజి, ఎమ్‌.రాజశేఖర్‌రెడ్డి నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 11 ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఆది పినిశెట్టి ఇందులో అథ్లెట్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: ప్రవీణకుమార్‌, మాటలు: వనమాలి

ఓటీటీలో రవితేజ ‘ఖిలాడీ’

Raviteja Khiladi movie: రవితేజ కథానాయకుడిగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడీ. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా మార్చి 11వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌

* అప్‌లోడ్‌ (వెబ్‌సిరీస్‌-2) మార్చి11

నెట్‌ఫ్లిక్స్‌

* అవుట్‌ ల్యాండర్‌(వెబ్‌ సిరీస్‌-6) మార్చి 07

* ద ఆండీ వార్‌హోల్‌ డైరీస్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 09

* ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ (వెబ్‌సిరీస్‌-5) మార్చి 09

* ఆ ఆడమ్‌ ప్రాజెక్టు (హాలీవుడ్‌)మార్చి11

జీ5

* మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ షమీమ్‌ (హిందీ సిరీస్‌) మార్చి11

*రైడర్‌ (తెలుగు, కన్నడ) మార్చి11

*రౌడీ బాయ్స్‌(తెలుగు) మార్చి11

ఆహా

* ఖుబూల్‌ హై (తెలుగు సిరీస్‌) మార్చి11

ఎంఎక్స్‌ ప్లేయర్‌

* అనామిక (హిందీ) మార్చి 10

ఇదీ చూడండి: పాన్​ ఇండియా చిత్రాల హవా మనదే.. రూ.1000కోట్లు!

ABOUT THE AUTHOR

...view details