తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ వారం థియేటర్-ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ఈ వారం కూడా కొన్ని సినిమాలు/వెబ్ సిరీస్​లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

balayya akhanda movie
బాలయ్య అఖండ మూవీ

By

Published : Nov 29, 2021, 1:51 PM IST

కరోనా తర్వాత వరుసగా సినిమాలు విడుదలవుతుండటం వల్ల బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. అయితే, ఇప్పటివరకూ పాసింజర్‌ రైలులా సాగిన సినీ ప్రయాణం డిసెంబరు నెలలోఎక్స్‌ప్రెస్‌ స్పీడ్‌లో దూసుకుపోనుంది. అందుకు ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలే కారణం. మరి డిసెంబరు మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేద్దామా!

డిసెంబరు 2న బాక్సాఫీస్‌ దబిడి దిబిడే!

రాబోయే పండగ సీజన్‌కు నాంది పలుకుతున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna). బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం 'అఖండ'(Akhanda). ప్రగ్యాజైశ్వాల్‌(Pragya Jaiswal) కథానాయిక. శ్రీకాంత్‌(srikanth), జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. 'సింహా', 'లెజెండ్‌' చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం వల్ల భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇందులో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రచార చిత్రాల్లో అఘోరగా బాలకృష్ణ(balakrishna) డైలాగ్‌లు విజిల్స్‌ వేయిస్తున్నాయి. ఇక బాక్సాఫీస్‌ వద్ద దబిడి దిబిడే మిగిలి ఉంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

బాలయ్య అఖండ మూవీ

కరోనా కష్టాలను దాటుకొని థియేటర్‌కు..

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌(Mohan lal) ప్రధాన పాత్రలో ప్రియదర్శన్‌ తెరకెక్కించిన చిత్రం 'మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం'(Marakkar). రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 2020లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. కరోనాతో లాక్‌డౌన్‌ విధించటం వల్ల అప్పటి నుంచి 'మరక్కార్‌' విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక దశలో విసుగు చెందిన నిర్మాత ఓటీటీకి ఇచ్చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడం వల్ల ఎట్టకేలకు డిసెంబరు 3న థియేటర్‌లలో విడుదల చేయనున్నారు. అర్జున్‌, కీర్తిసురేశ్‌, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. థియేటర్‌లో విడుదల కాకముందే 'మరక్కార్‌' మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది.

మరక్కార్ మూవీ

'బ్యాక్‌ డోర్‌'లో ఏం జరిగింది?

పూర్ణ(Poorna) ప్రధాన పాత్రలో నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’(Back Door). కర్రి బాలాజీ తెరకెక్కించారు. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 3న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని దర్శకుడు బాలాజీ తెలిపారు.

బ్యాక్​డోర్ మూవీ

‘ఆర్‌ఎక్స్‌100’ హిందీ రీమేక్‌ వచ్చేస్తోంది!

చక్కటి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కి.. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ (RX 100). టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ‘తడప్‌’ (Tadap) పేరుతో ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి (Ahan Shetty) ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అహాన్‌కు జంటగా తారా సుతారియా (Tara Sutaria) కథానాయికగా నటిస్తున్నారు. మిలాన్‌ లుతారియా (Milan Luthria) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 3న (Tadap Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.

తడప్ మూవీ

‘స్కైలాబ్‌’ భూమిపై పడుతుందని తెలిసిన తర్వాత..

సత్యదేవ్‌(satyadev), నిత్యమేనన్‌(nityamenen), రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘స్కైలాబ్‌’(skylab). విశ్వక్‌ ఖండేరావు దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. డా.రవి కిరణ్‌ సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1979 నేపథ్యంలో సాగే చిత్రమిది. గౌరి, ఆనంద్, సుబేదార్‌ రామారావులు ఒకొక్కరు ఒక్కో లక్ష్యంతో ముందుకు సాగుతుంటారు. తమ కలలు నెరవేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే అనుకుంటారు. సరిగ్గా అప్పుడే అంతరిక్షంలోకి వెళ్లిన స్కైలాబ్‌(skylab) ఉపగ్రహం సాంకేతిక కారణాలతో భూమిపై పడతుందనే విషయం తెలుస్తుంది. అప్పుడు అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? అవి ఎలా నెరవేరాయన్నది ‘స్కై లాబ్‌’ కథ. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

స్కైలాబ్ మూవీ

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

నెట్‌ఫ్లిక్స్‌

* లాస్‌ ఇన్‌ స్పేస్‌ (వెబ్‌ సిరీస్‌) డిసెంబరు 1

* ద పవర్‌ ఆఫ్ ది డాగ్‌(హాలీవుడ్‌) డిసెంబరు 1

* కోబాల్ట్‌ బ్లూ(హాలీవుడ్‌) డిసెంబరు 3

* మనీ హెయిస్ట్‌ 5 (స్పానిష్‌ సిరీస్‌)

ఆహా

* మంచి రోజులు వచ్చాయి(తెలుగు) డిసెంబరు 3

జీ5

* బాబ్‌ విశ్వాస్‌(హిందీ) డిసెంబరు 3

అమెజాన్‌ ప్రైమ్‌

* ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌(హిందీ వెబ్‌సిరీస్‌)డిసెంబరు 3

బుక్‌ మై షో

ఎఫ్‌9(తెలుగు) డిసెంబరు 01

మంచిరోజులు వచ్చాయి మూవీ

ABOUT THE AUTHOR

...view details