కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూనే వరుస చిత్రాలు తెలుగుతెరపై సందడి చేస్తున్నాయి. కొన్ని థియేటర్ వైపు అడుగులు వేస్తుంటే, మరికొన్ని ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని రోజులుగా అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో వినోదం సమతూకంలో కొనసాగుతోంది. ఈ వారం కూడా అలా అలరించబోతున్న చిత్రాలేంటో చూసేద్దామా.
గల్లీరౌడీ
సందీప్ కిషన్, నేహాశెట్టి, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'గల్లీ రౌడీ'. వైజాగ్‌కు చెందిన 'గల్లీరౌడీ'గా సందీప్ కనిపిస్తారు. జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 17న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
ప్లాన్ బి
శ్రీనివాసరెడ్డి, మురళీ శర్మ, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్లాన్ బి'. తమ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు రాజమహి ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబరు 17న థియేటర్లలోకి రానుంది.
విజయ రాఘవన్
విజయ్ ఆంటోని, ఆత్మిక ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సినప్పటికీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబరు 17న వెండితెరపై రిలీజ్ అవుతోంది.
ఫ్రెండ్షిప్
టీమ్ఇండియా క్రికెటర్ హర్భజన్ సింగ్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. కాలేజీ ఫ్రెండ్షిప్ నేపథ్య కథతో తెరకెక్కించారు. హర్భజన్ ఇందులో విద్యార్థిగా కనిపిస్తాడు. శ్యామ్ సూర్య దర్శకుడు. సెప్టెంబరు 17న థియేటర్లలో విడుదల కానుంది.
జెమ్
విజయ్ రాజా, రాశీసింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'జెమ్'. రాయలసీమ నేపథ్యంతో ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇందులో విజయ్ ఓ సీన్లో నగ్నంగానూ నటించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకురాలు. సెప్టెంబరు 17న థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
హనీట్రాప్
వివి వామనరావు, రిషి, శిల్పా నాయక్ ప్రధాన పాత్రల్లో సమాకాలీన కథతో తీసిన ఈ సినిమా.. సెప్టెంబరు 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.
డోంట్ బ్రీత్ 2
స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా తీశారు. థ్రిల్లర్ కథతో 'డోంట్ బ్రీత్' చిత్రానికి కొనసాగింపుగా దీనిని తెరకెక్కించారు. సయేగస్ దర్శకుడు. సెప్టెంబరు 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఓటీటీ
మాస్ట్రో
నితిన్, తమన్నా, నభా నటేశ్ నటించిన ఈ థ్రిల్లర్.. సెప్టెంబరు 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతోంది.'అంధాధున్'కు తెలుగు రీమేక్ ఈ సినిమా. నితిన్ అంధుడిగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు.
అనబెల్ సేతుపతి
విజయ్ సేతుపతి, తాప్సీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈనెలలో వస్తున్న విజయ్ సేతుపతి మూడో సినిమా ఇది. దీపక్ సుందర్రాజన్ దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దీనిని ప్రేక్షకులకు అందించనున్నారు.
ఇచ్చట వాహనములు నిలుపరాదు