బాలీవుడ్లో నిలదొక్కుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అభిమానులకు నచ్చేలా సినిమా తీస్తూనే, ఇతర హీరోల పోటీని తట్టుకుంటూ నెగ్గుకురావాలి. ఇప్పుడున్న కొంతమంది స్టార్స్ ఇలానే చాలా కష్టాలు పడితే గానీ ఈ స్థాయికి రాలేకపోయారు. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ తారలు.. తొలి జీతం వందల్లో తీసుకున్నారంటే మీరు నమ్మగలరా? అవును మీరు విన్నది నిజమే. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్‌ఖాన్, ప్రియాంకా చోప్రా.. తొలి జీతం ఎంత తీసుకున్నారు? ఇప్పుడెంత తీసుకుంటున్నారో చూద్దాం.
అక్షయ్ కుమార్
హీరోగా ఏడాదికి నాలుగు సినిమాలకు తగ్గకుండా చేస్తున్న అక్షయ్ కుమార్.. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం రూ.120 కోట్లు అందుకుంటున్నారు. అయితే నటుడు కాకముందు బ్యాంకాక్‌లో చెఫ్, వెయిటర్‌గా పనిచేశారు అక్షయ్. నెలకు రూ.1500 జీతం మాత్రమే తీసుకున్నారు.
అమితాబ్ బచ్చన్
భారతీయ సినిమా.. లవ్‌స్టోరీలు, రొమాంటిక్ హీరోలతో ఉన్న కాలంలో 'జంజీర్'తో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. నటన, గానం, రచన, డ్యాన్స్.. ఇలా ఏదైనా సరే తాను రెడీ అంటూ ముందుకొచ్చారు. తనకు ఏ పాత్ర ఇచ్చినా సరే, అందుకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుని వావ్ అనిపించారు. అయితే వీటి కంటే ముందు కోల్‌కతాలోని షా& వాల్ష్ కంపెనీలో రూ.500 జీతానికి ఎగ్జిక్యూటివ్‌గా అమితాబ్ పనిచేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గతంలో పేర్కొంది. ఫ్రీప్రెస్ జర్నల్ తెలిపిన ప్రకారం బిగ్‌బీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.18-20 కోట్లు తీసుకుంటున్నారు.