బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆయన ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైరస్ బారి నుంచి కోలుకున్నారని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు ప్రముఖ మీడియా సంస్థల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
వైరస్ నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఆయా ఛానెళ్లు ప్రకటించాయి. అయితే తాజాగా వీటిపై స్పందించారు బిగ్‌బీ. తనకు నెగిటివ్ అని తేలలేదని.. ఇంకా చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అసత్య వార్తలు ప్రచారం చేయోద్దని ట్విట్టర్ వేదికగా సూచించారు.